సినిమా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్లలో రెజీనా ఒకరు. మిడిల్ రేంజ్ హీరోలకు, యంగ్ హీరోలకు ఎక్కువగా జోడీగా నటించిన రెజీనా తాజాగా మాట్లాడుతూ నేను తొమ్మిదేళ్ల వయస్సు నుంచి నటించడం మొదలుపెట్టానని తెలిపారు. 25 ఏళ్లుగా ఎన్నో సినిమాలతో పాటు యాడ్స్ లో నటించానని ఆమె పేర్కొన్నారు. అందువల్ల ఇండస్ట్రీ గురించి నాకు పూర్తిస్థాయిలో అవగాహన ఉందని ఆమె వెల్లడించారు.
 
పరిశ్రమలో నటిగా ఉండటం ప్రధానంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో దక్షిణాది నటిగా కొనసాగడం కష్టమని రెజీనా చెప్పుకొచ్చారు. నేను హిందీ సినిమా కోసం అడిషన్ ఇచ్చిన సమయంలో ఆ భాష మాట్లాడగలనో లేదో చూశారని రెజీనా పేర్కొన్నారు. సౌత్ సినీ పరిశ్రమలో ఈ విషయాన్ని పట్టించుకోరు అని రెజీనా వెల్లడించడం గమనార్హం.
 
ఇక్కడ ఏ భాషకు చెందినవారినైనా ఎంపిక చేసుకుంటారని రెజీనా పేర్కొన్నారు. ఆ రీజన్ వల్లే కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో ఇతర భాషలకు చెందిన ఎంతోమంది నటీనటులు అగ్ర తారలుగా ఎదిగారని రెజీనా వెల్లడించారు. హిందీ సరిగ్గా మాట్లాడలేకపోవడం వల్ల నాకు ఎన్నో ఆఫర్లు మిస్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు. నేను ఒక పంజాబీ అమ్మాయిగా నటించలేనని రెజీనా అన్నారు.
 
అయితే పంజాబీ అమ్మాయి మాత్రం సౌత్ నటిగా చేయగలదని నా విషయంలో అదే జరిగిందని ఆమె వెల్లడించారు. నార్త్ లో నటిస్తున్న హీరోయిన్లే సౌత్ సినిమాల్లో సైతం నటిస్తున్నారని రెజీనా చెప్పుకొచ్చారు. రెజీనా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. రెజీనా క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. రెజీనా కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. రెజీనా స్టార్ హీరోల సినిమాలలో ఎక్కువగా నటిస్తే ఈ హీరోయిన్ కెరీర్ మరింత పుంజుకుంటుందని చెప్పవచ్చు. హీరోయిన్ రెజీనా పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.






 


మరింత సమాచారం తెలుసుకోండి: