యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించి కేవలం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా కెరియర్ను కొనసాగించడం మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే తారక్ కొంత కాలం క్రితం దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం తారక్ ఏకంగా హిందీ సినిమా అయినటువంటి వార్ 2 లవ్ నటిస్తున్నాడు.

తారక్ తన సినిమాల కోసం మాత్రమే కాకుండా పక్క వాళ్ళ సినిమా కోసం కూడా అనేక సార్లు కష్టపడ్డా సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే తారక్ ఇప్పటి వరకు తన కెరియర్లో కొన్ని సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. కొంత క్రితం సాయి ధరమ్ తేజ్ హీరో గా రూపొందిన విరూపాక్ష సినిమా టీజర్ కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ద్వారా ఈ సినిమా టీజర్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా టీజర్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ దేవరకొండ "కింగ్డమ్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్ కు తారక్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఈ సినిమాకు తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నాడు అనే వార్త బయటకు రావడంతోనే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ కు తారక్ ఇచ్చిన వాయిస్ ఓవర్ కూడా అద్భుతంగా సెట్ కావడంతో ఈ సినిమా టీజర్ కు కూడా మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: