మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి ప్రియాంక అరుణ్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తర్వాత ఈమె శర్వానంద్ హీరో గా రూపొందిన శ్రీకారం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఇలా తెలుగు లో ఈమె నటించిన రెండు సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాలను అందుకోకపోవడంతో ఈ నటి ఆ తర్వాత తమిళ సినీ పరిశ్రమ వైపు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె నటించిన కోలీవుడ్ సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధించడంతో ఈమెకు తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే మళ్లీ ఈమె ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమపై ఆసక్తిని చూపించడం మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈమె కొంత కాలం క్రితం నాని హీరోగా రూపొందిన సరిపోదా శనివారం అనే సినిమాలో హీరోయిన్గా నటించి మొట్ట మొదటి విజయాన్ని తెలుగు లో అందుకుంది. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఓజి సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో పెద్ద స్థాయిలో అందాలను ఆరబోయకుండా వస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అతిగా అందాలను ఆరబోయడం లేదు. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకుని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Pam