"వాలెంటైన్స్ డే" . నేడు ఫిబ్రవరి 14 . ఈరోజు వాలెంటైన్స్ డే ను చాలా ఘనంగా జరుపుకుంటూ ఉంటారు ప్రేమికులు.  కేవలం ప్రేమలో ఉన్న వారే కాదు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లయిన జంటలు ఇంట్లో పెద్దలు చెప్పిన సంబంధం కుదుర్చుకుని పెళ్లిళ్లు చేసుకునేవారు రకరకాలుగా ఈ వాలెంటైన్స్ డే ని జరుపుకుంటూ ఉంటారు.  కొందరు తమ లవర్స్ కి గిఫ్ట్స్ ఇచ్చి పుచ్చుకుంటే . మరికొందరు హద్దులు మీరుతూ వల్గర్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు .


అయితే పెళ్లయిన జంటలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఈ వాలెంటైన్స్ డే ని జరుపుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.  కేవలం ప్రేమికులు మాత్రమే కాదు పెళ్లయిన వాళ్లు కూడా వాలెంటైన్స్ జరుపుకుంటారు.  వాళ్ళ భార్యలతో భర్తలతో చాలా సరదాగా ఈరోజు గడపడానికి ..అట్లీస్ట్ ఈ ఫాస్ట్ వర్కింగ్ అవర్స్ లో వాళ్ళకంటూ కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు . నేడు వాలెంటైన్స్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నారు  స్టార్ సెలబ్రిటీస్.



మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే స్టార్ రొమాంటిక్ కపుల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారా ..? అంటూ వాళ్లు షేర్ చేసే పిక్చర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . అయితే ఇలాంటి మూమెంట్లోనే ఉపాసన పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉపాసన ఎప్పుడు కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది . సమాజానికి ఉపయోగపడే పోస్ట్ ల చేస్తూ ఉంటుంది . వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ఎలాంటి పోస్టు పెడుతుందా..? అంటూ వెయిట్ చేసిన ఫ్యాన్స్ కు బిగ్ షాకే తగిలింది.



మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీ పెట్టింది. "వాలెంటైన్స్ డే అనేది 22 ఏళ్ళు అలాగే అంతకంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయిలకు మాత్రమే.. సో లేడీస్ అదే ఆంటీస్ మీ వయసు గానీ ముగిసినట్లయితే దయచేసి వెయిట్ చేయండి ..త్వరలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాబోతుంది. అప్పటివరకు వెయిట్ చేయాల్సిందే " అంటూ నవ్వే ఎమోజీలను షేర్ చేసింది ఉపాసన.  ఈ పోస్ట్ చాలా సరదాగా ఫన్నీగా పెట్టింది . అయితే సోషల్ మీడియాలో మాత్రం కావాలని కొందరు  పోస్ట్ పై చీప్ గా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు .



అయితే ఉపాసన పెట్టిన పోస్ట్ కొంతమంది వాలెంటైన్స్ డే జరుపుకోవాలని అనుకున్న  ఆంటీలకు బిగ్ డౌట్ తీసుకొచ్చేసింది . అంటే ఆంటీలు వాలెంటైన్స్ డే జరుపుకోకుడదా..? అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.  మొత్తానికి ఉపాసన అమ్మాయిలకు ఆంటీలకు మధ్య ఉన్న తేడాను భలే చెప్పేసింది. అమ్మాయిలు వాలెంటైన్స్ డే జరుపుకుంటే ఆంటీలు మహిళా దినోత్సవం జరుపుకోవాలి అంటూ కరెక్ట్ గానే చెప్పింది ఉపాసన అంటున్నారు జనాలు.  సోషల్ మీడియాలో ప్రజెంట్ ఉపాసన పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: