తమిళ సినీ పరిశ్రమలో వచ్చిన హార్రర్ సిరీస్ మూవీలలో అద్భుతమైన క్రేజ్ ను , గుర్తింపును సంపాదించుకున్న సిరీస్ మూవీలలో కాంచన సిరీస్ మంచి స్థానంలో ఉంటుంది. ఇప్పటి వరకు ఈ సిరీస్ నుండి మూడు సినిమాలు రాగా , ఆ మూడు మూవీ లు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఆ మూడు సినిమాలలో కూడా రాఘవ లారెన్స్ హీరో గా నటించాడు. ఇకపోతే రాఘవ లారెన్స్ కి కాంచన సిరీస్ మూవీల ద్వారా అద్భుతమైన గుర్తింపు వచ్చింది.

ఇకపోతే చాలా కాలం నుండి కాంచన 4 సినిమాకు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. కాంచన సిరీస్ మూవీ లలో ఇప్పటి వరకు వచ్చిన మూడు సినిమాలలో కూడా సౌత్ నటి మనులే హీరోయిన్లుగా నటించారు. ఇకపోతే కాంచన 4 మూవీ కోసం మేకర్స్ సరికొత్త మార్పులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాంచన 4 మూవీలో సౌత్ నటిని కాకుండా హిందీ నటిని హీరోయిన్గా తీసుకోవాలి అనే ఆలోచనకు మేకర్స్ వచ్చినట్లు అందులో భాగంగా ఇప్పటికే ఓ బాలీవుడ్ హాట్ బ్యూటీని హీరోయిన్గా సెలెక్ట్ కూడా చేసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటి మణులలో ఒకరు అయినటువంటి నోరా ఫతేహి సినిమాలో హీరోయిన్గా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే కాంచన 4 మూవీ యూనిట్ నోరా ఫతేహ కి ఈ సినిమా కథను వివరించగా , ఆ బ్యూటీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: