![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/prabhas-ddccaa8d-e753-4d12-ab81-e0fb96d52951-415x250.jpg)
ఇక డార్లింగ్ ఆఖరిగా 'కల్కి 2898 ఏడీ'తో గర్జించిన విషయం విదితమే. ఈ మైథలాజికల్ ఫిల్మ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసి ఏకంగా రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సొంతం చేసుకున్నారు. నెక్ట్స్ కల్కి2పై భారీ అంచనాలను సెట్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రభాస్ ఓవైపు భారీ చిత్రాల్లో నటిస్తూనే అభిమానులను దృష్టిలో పెట్టుకొని గెస్ట్ అపియరెన్స్ కూడా చేసేస్తున్నారు. గతంలో అక్షయ్ కుమార్ చిత్రంలోని ఓ సాంగ్ లో స్పెషల్ అపియరెన్స్ ఇవ్వగా, పూరీ కొడుకు ఆకాష్ పూరీ, నవీన్ పొలిశెట్టి చిత్రాలకు ప్రమోషన్ షురూ చేసారు డార్లింగ్. ఈ క్రమంలోనే మంచు విష్ణు నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'కన్నప్ప'లో రుద్ర అనే పాత్రని పోషించారు. ఈ నేపథ్యంలోనే కన్నప్ప చిత్రంలో ప్రభాస్ నటించినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఈ సందర్బంగా 'కన్నప్ప' టీమ్ నుంచే ఓ న్యూస్ బయటికి వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. విషయం ఏమిటంటే? ప్రభాస్ ఈ సినిమా కోసం మంచు విష్ణు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని వినికిడి. వారి మధ్య ఉన్న స్నేహం కారణంగా ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా ఈ ప్రత్యేక పాత్రలో ప్రభాస్ నటించారంట. కాగా కన్నప్ప చిత్రం మంచు విష్ణు కెరీర్లోనే భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది. మహాభారతం సీరియల్ డైరెక్టర్ "ముఖేష్ కుమార్ సింగ్" ఈ మైథలాజికల్ సినిమాకు దర్శకుడు కావడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. శివుడిగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, రుద్ర పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్, కిరాత పాత్రలో మోహన్ లాల్, పార్వతీ పాత్రలో కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి విదితమే. కాగా న్యూజిలాండ్ లోనే ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకున్నారని వినికిడి. ఏప్రిల్ 25 ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ప్రేక్షకుల మందికి రాబోతోంది.