సినిమా ఇండస్ట్రీ లో ఒకరి ని మొదట అనుకున్న పాత్రలో మరొకరు నటించడం అనేది సర్వ సాధారణం గా జరుగుతూ ఉంటుంది. ఇక తాము రిజెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నట్లయి తే ఎందుకు ఆ సినిమా ను ఆ సమయంలో వదిలేసామా అని నటీనటులు ఫీల్ కావడం అదే తా ము వదిలేసిన సినిమా కనుక బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టినట్ల యితే ఆ రోజు ఆ సినిమాను రిజెక్ట్ చేసి చాలా మం చి పని చేశాం అని ఆనంద పడటం జరగడం కూడా సర్వ సాధారణమైన విషయం.

ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించిన అర్చన కూడా తన కెరియర్లో ఓ సినిమాను వదిలేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఆ సినిమాలు ఎందుకు వదిలేసాను అని బాధపడుతున్న ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం ఎస్ ఎస్ రాజమౌళి రామ్ చరణ్ హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మగధీర అనే మూవీ ని రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీహరి ఓ కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ సినిమాలో శ్రీహరి కి లవర్ పాత్రలో సలోని నటించింది. సలోని పాత్రలో మొదట రాజమౌళి అర్చన ను తీసుకోవాలి అనుకున్నాడట. అందులో భాగంగా ఆమెను సంప్రదించగా ఆమె మాత్రం ఆ పాత్రను చేయను అని చెప్పిందట. ఆ తర్వాత అందులో సలోని ని తీసుకున్నారట. ఆ సినిమా ద్వారా సలోని కి మంచి గుర్తింపు వచ్చింది. ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా అర్చన ఆ సినిమాను రిజెక్ట్ చేసినందుకు చాలా బాధపడుతున్నాను అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: