తెలుగు సినీ పరిశ్రమ లో కొన్ని సంవత్సరాల క్రితం ఫ్యాక్షన్ సినిమాల హవా నడిచింది. స్టార్ హీరో లు అంతా వరుస పెట్టి ఫ్యాక్షన్ సినిమాలలో నటిస్తూ వచ్చా రు . జనాలు కూడా కాస్త కథలు దగ్గరగా ఉన్నా కూడా ఫ్యాక్షన్ కథలను ఆదరించడంలో అత్యంత ఆసక్తిని చూపించారు . దా నితో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి . ఇకపోతే ఓ దర్శకుడు ఫ్యాక్షన్ సినిమాలతో ఏకంగా మూడు ఇండస్ట్రీ హిట్ లను అందుకున్నాడు. ఆ దర్శకుడు ఎవరు ..? ఆ సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

ఫ్యాక్షన్ సినిమాల ద్వారా అద్భుతమైన విజయాలను అందుకున్న దర్శకులలో బి గోపాల్ ముందు వరసలో ఉంటారు. ఈయన మొదటగా బాలకృష్ణ హీరో గా సమర సింహా రెడ్డి అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ ను నిలిచింది. ఈ సినిమా తర్వాత బి గోపాల్ , బాలకృష్ణ హీరో గా నరసింహ నాయుడు అనే మరో ప్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా భారీ అంచనాల నడమ విడుదల అయ్యి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తర్వాత బి గోపాల్ , చిరంజీవి హీరోగా ఇంద్ర అనే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని రూపొందించాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ఏకంగా ఇండస్ట్రీ హిట్ ను అందుకుంది. బి గోపాల్ ఇలా సమర సింహా రెడ్డి , నరసింహ నాయుడు , ఇంద్ర అనే మూడు ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలలో ఏకంగా ఇండస్ట్రీ హిట్ లను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: