టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా సినిమాలను వదిలేసాడు. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకున్నాయి. అలా తారక్ తన కెరీర్ లో వదిలేసిన సినిమాలలో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్న సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

తారక్ తన కెరీర్ లో వదిలేసిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న మూవీలలో బొమ్మరిల్లు , భద్ర సినిమాలు కూడా ఉన్నాయి. సిద్ధార్థ్ హీరో గా రూపొందిన బొమ్మరిల్లు సినిమా కథను మొదట తారక్ కి ఆ సినిమా దర్శకుడు భాస్కర్ వినిపించగా ... ఆ కథ అద్భుతంగా ఉన్న తనపై ఆ సినిమా అస్సలు సెట్ కాదు అని తనపై తీస్తే ఆ మూవీ ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో ఆ కథను తారక్ రిజెక్ట్ చేశాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో భాగంగా తారక్ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇకపోతే రవితేజ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన భద్ర సినిమా కథను మొదటగా బోయపాటి శ్రీను , తారక్ కి వినిపించాడట. కానీ కథ మొత్తం విన్న తారక్ కి ఆ సినిమా కథ పెద్దగా నచ్చలేదట. దానితో ఆ మూవీ ని రిజెక్ట్ చేశాడట. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆ సినిమాను వదిలేసినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అని ఒకానొక సినిమా ఈవెంట్ లో భాగంగా తారక్ చెప్పుకొచ్చాడు. ఇలా తారక్ తన కెరియర్ లో చాలా సినిమాలనే వదులుకున్న అందులో బొమ్మరిల్లు , భద్ర సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ రెండు మూవీ లు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: