మన ఇండియన్ చిత్ర పరిశ్రమలో కమలహాసన్ - చిరంజీవి ఇద్దరు గొప్ప నటులే .. ఇద్దరికీ కోట్లల్లో విపరీతమైన అభిమానులు ఉన్నారు .. ఇద్దరూ లెజెండ్సె ఇద్దరికీ జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి .. అలాగే ఇద్దరు రాజకీయాల్లో అడుగుపెట్టారు. సొంత పార్టీలు పెట్టారు అధికారాన్ని అందుకోవాలని అనుకున్నారు .. కానీ ఇద్దరు ఫెలయ్యారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న తేడా ఏమిటంటే .. గతంలో చిరంజీవి తన పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి రాజ్యసభ సభ్యులయ్యారు కేంద్రంలో మంత్రి పదవి అందుకున్నారు .. ఇక ఇప్పుడు కమలహాసన్ కూడా తన పార్టీ మక్కల్‌ నీది మయ్యం పార్టీని తమిళనాడు అధికార పార్టీ డీఎంకేలో విలీనం చేయబోతున్నారు డీఎంకే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వబోతుంది.


ఇప్పుడు ఇద్దరం మధ్య ఉన్న తేడా విషయానికి వస్తే .. చిరంజీవి కేంద్ర‌ ప్రభుత్వంలో మంత్రి పదవి అందుకోగా.. ఇప్పుడు కమలహాసన్ కు ఆ ఛాన్స్ లేదు .. ఎందుకంటే ఆయన డీఎంకే నుంచి రాజ్యసభకు ఎన్నికవుతున్నారు కాబట్టి.. మక్కల్‌ నీది మయ్యం పార్టీ అధినేతగా ఉన్న కమలహాసన్ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఇండియా కూటమితో పొత్తు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో కమలహాసన్ పార్టీ పోటీకి దూరంగా ఉండేందుకు ఓకే చెప్పింది .. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి కోసం ఎంతో  ప్రచారం కూడా చేశారు .. ఇక ఇండియా కూటమీ రాష్ట్రంలోని 39 లోక్సభ స్థానాలను గెలుచుకొని క్లీన్ స్పీప్ చేసింది .. అయితే లోక్సభ ఎన్నికలకు ముందే డీఎంకె.. కమలహాసన్ పార్టీల మధ్య కుదిరిన ఢిల్‌లో భాగంగా తమకు మద్దతు తెలిపిన కమలహాసన్ కు ప్రతిపాలంగా రాజ్యసభ సీటు ఇస్తామని ముఖ్యమంత్రి స్టాలిన్ డిఎంకె అధినేత హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.
 

ఇక ఇప్పుడు ఆ మాటకు అనుగుణంగానే వచ్చే జూన్లో ఆరు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న క్రమంలో అందులో  కమలహాసన్ రాజ్యసభకు నామినేట్ చేయాలని స్టాలిన్ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ విష‌యం పై డీఎంకే పార్టీ కూడా కమలహాసన్ తో చర్చలు కూడా జరిపినట్టుగా తెలుస్తుంది. 2018 ఫిబ్రవరిలో కమలహాసన్ ఎంఎన్ఎం పార్టీని పెట్టారు. ఇక తన పార్టీని పారదర్శకత పాలన సంస్కరణలు ప్రాంతీయ సహకారాన్ని సమర్థించి వేదికగా పేర్కొన్నారు. ఆ తర్వాత వచ్చిన 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంఎన్ఎం పోటీ చేసిన నియోజకవర్గం 3.2% ఓట్లను అందుకుంది అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది . అలాగే చెన్నై , కోయంబత్తూర్ , మధుర వంటి సిటీస్లో ఎంఎన్ఎం గట్టి పోటీ ఇచ్చింది .. అలాగే కొన్ని ప్రాంతాల్లో లక్షకు పైగా ఓట్లను కూడా గెలుచుకుంది .. అయితే గ్రామీణ నియోజకవర్గాల్లో మాత్రం ఈ పార్టీకి ఆదరణ దక్కలేదు .. ఈ పార్టీ నుంచి పోటీ చేసిన‌ కొందరు అభ్యర్థులు డిపాజిట్లు కూడా కోల్పోయారు .. ఆ తర్వాత 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎంఎన్ఎం ఒక సీటు కూడా గెలవలేదు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలో కమలహాసన్ 1,28 ఓట్లు తేడాతో బీజేపి అభ్యర్థి శ్రీనివాస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు . ఆ తర్వాత 2022 లో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూడా కమలహాసన్ పార్టీకి చావు దెబ్బ తగిలింది . 2024 లోక్సభ ఎన్నికల్లో ఊహించిన విధంగా కమలహాసన్ ఇండియా కూటమికి మద్దతుగా నిలిచారు .. అందుకు ప్రతిఫలంగా ఇప్పుడు కమలహాసన్  కు రాజ్యసభ సభ్యత్వం దక్కబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: