స్టార్ బ్యూటీ శృతిహాసన్ ప్రజెంట్ సైలెంట్ గా ఉన్నారా ? గట్టి ప్లానింగ్ తో వస్తున్నారా ? అంటే దీనికి ఆన్సర్ వెతుక్కోవాల్సిన అవసరం లేదు ఆమె చేతుల్లో ఉన్నవన్నీ క్రేజీ సినిమాలే .. ముందు ముందు ఉంది అసలు అయిన సీజన్ అంటూ అభిమానులతో హ్యాపీ న్యూస్ పంచుకుంటుంది ఈ స్టార్ బ్యూటీ .. ఇక గతంలో లోకేష్‌ కనగరాజ్‌తో శృతిహాసన్ చేసిన మ్యూజిక్ వీడియో చూసిన వారందరూ వీరిద్దరూ కలిసి రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక సినిమా చేస్తారని అంత అనుకున్నారు . అలాగే ఆ సినిమాతోనే లోకేష్ హీరోగా సినిమాల్లో అడుగు పెడతారేమో అని కూడా అన్నారు .. అయితే ఎప్పుడు అలా అనుకున్న వారు మాత్రం కాస్త డిసప్పాయింట్ అయ్యారు..


దీనికి అసలు కారణం లోకేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం లేదు డైరెక్టర్ గానే కంటిన్యూ అయ్యారు .. అయితే ఆయన సినిమాల్లో మాత్రం శ్రుతికి మంచి అవకాశాలు వస్తున్నాయి .. ప్రెసెంట్ లొకేషన్ రజనీకాంత్ తో కూలీ తెర్కేకిస్తున్నాడు .. ఇక ఈ సినిమా కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు .. ఈ సినిమా కోసం శృతిహాసన్ కూడా అంతే ఇష్టంగా ఎదురుచూస్తుంది. ఇక ఈ సినిమాలో శృతి ఏ పాత్ర చేశారో చూడడానికి ఆమె అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .. లాస్ట్ ఇయర్స్ సలార్ తో సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ ఏడాది కూలి మూవీతో పలకరించడానికి రెడీగా ఉంది . అలాగే ప్రజెంట్ ప్రభాస్ ఉన్న సినిమాల కమిట్మెంట్ ని చూస్తుంటే స‌లార్ సిక్వెల్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే అవకాశం లేదు ..

 

ఆ సమయాన్ని విజయ్ 69 సినిమాకి ఇచ్చేసారని టాక్ కూడా నడుస్తుంది .. ఇదే క్రమంలో ఇప్పటికే దళపతి 69 సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. అలాంటప్పుడు శృతిహాసన్ చేసే రోల్ ఏంటి ? ఈమె కూడా హీరోయిన్గా కనిపిస్తారా ? లేకుంటే స్పెషల్గా ఆమె కోసం ఏమైనా కొత్త క్యారెక్టర్ తీసుకొస్తున్నారా .. అనే చర్చ కూడా జరుగుతుంది .. దాదాపు పదేళ్ల  క్రితం విజయ్ శృతి జంట‌గా పులి సినిమాలో నటించారు. ఈ సంవత్సరం విజయ్ 69 తో పాటు ట్రైన్ మూవీ కూడా రిలీజ్ కానుంది  ..విజయ్ సేతుపతితో కలిసి నటించిన ఈ మూవీ మీద కూడా కోలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి .. ఈ విధంగా 2025లో శృతి కంప్లీట్ గా కోలీవుడ్కే తన డేట్లు ఇచ్చేసారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: