![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-manushi-chiller653ae5a4-c616-4457-9b72-6daee68da5df-415x250.jpg)
2017 మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది మానుషి చిల్లర్ .. ఆ తర్వాత వెంటనే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కు జంటగా సామ్రాట్ పృథ్వీరాజ్ మూవీ తో బాలీవుడ్ లో ఎంట్రీ వచ్చింది .. డైరెక్టర్ చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వం వహించిన ఈ సినిమాను దాదాపు 220 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించుగా 2022లో విడుదలై బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలిపోయింది .. ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల మాత్రమే రాబట్టింది.. మొదటి సినిమా అనే భారీ డిజాస్టర్ కావడంతో మానుషికి అంతగా గుర్తింపు రాలేదు .. ఆ తర్వాత కూడా బాలీవుడ్ లోనే విక్కీ కౌశల్ కి జంటగా ద గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలో నటించినప్పటికీ ఈ మూవీ సైతం ప్లాప్ గా మిగిలింది .. ఇక దాంతో మానుషికి చిత్ర పరిశ్రమలో ముందుకు వెళ్ళటం మరింత సవాల్గా మారింది ..
ఆ తర్వాత మరోసారి అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి అలయ ఎఫ్ స్టార్స్ సినిమా సైతం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది .. ఆ తర్వాత కూడా ఈమె నటించిన తారిఖ్ మూవీ కూడా డిజాస్టర్ అయింది .. ఆ తర్వాత తెలుగులో మెగా హీరో వరుణ్ తేజ్ కి జంటగా ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది .. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలిపోయింది .. దీంతో మానుషికి ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు .. ప్రస్తుతం ఈ ప్రపంచ సుందరి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఆమెకు ఎలాంటి ప్రయోజనం దక్కట్లేదు .. మరి రాబోయే రోజుల్లో అయినా ఈ ప్రపంచ సుందరికి సరైన క్రేజ్ వస్తుందో లేదో చూడాలి.