![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/brahmananadamecae8859-83ac-4d8b-808e-2487c92c84d0-415x250.jpg)
అయితే ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్ కు బ్రహ్మానందం ఇంటర్వ్యూ ఇచ్చారు .. అదే సమయంలో తన స్నేహితుడు తన తోటి నటుడు ఎమ్మెస్ నారాయణను తలుచుకుని కొంత భావోద్వేగానికి లోనయ్యారు. ఇక తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో బ్రహ్మానందం మాట్లాడుతూ .. ఇక తన జీవితంలో జరిగిన ఎన్నో విషయాలు గురించి సిని ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు .. అదే క్రమంలో ఎమ్మెస్ నారాయణ తన చివరి రోజుల్లో మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడాలని కాగితం మీద రాసి ఇచ్చారట కదా అంటూ అక్కడ యాంకర్ అడగగా .. బ్రహ్మానందం దాని గురించి మాట్లాడుతూ .. నేను సంపాదించుకున్న సంపద అది .. ఒక వ్యక్తి , ఒక జీనియస్ తన చనిపోయే చివరి రోజుల్లో ఎన్నో ఆలోచనలు బ్రైన్లో తిరుగుతూ ఉంటాయి . అతనికి ఎంతోమంది తెలుసు ఎన్నో పరిచయాలు ఉన్నాయి .. తల్లి తండ్రి రక్త సంబంధాలు స్నేహితులు ఇలా అనేక బంధాలు అతనికి ఉంటాయి ..
కానీ అలాంటి సమయంలో ఓ వ్యక్తిని చూడాలనిపించడం ఆ వ్యక్తిని ఎలాగైనా కలుసుకోవాలనిపించడం .. మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సైగ చేసి తన కూతురితో తెల్ల కాగితం మీద బ్రహ్మానందం అన్నయ్యను చూడాలని ఉంది అని రాసి ఇస్తే .. ఆ అమ్మాయి అది చదువుకుని నాకు ఫోన్ చేసింది .. అంత హుటా హుటన హాస్పటల్ కి వెళ్ళిపోయాను .. అక్కడ ఆస్పత్రిలో ఎమ్మెస్ నారాయణను చూడ్డానికి వెళ్లగానే బెడ్ పైనుంచి నన్ను చూసి అతని కళ్ళల్లో నీళ్లు వచ్చాయి .. నేను ఎప్పటికీ ఆ దృశ్యాన్ని మర్చిపోలేను నన్ను చూస్తూ నా చేయి గట్టిగా పట్టుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు .. తర్వాత డాక్టర్ తో మాట్లాడాను ఆయన నా రక్తసంబంధం కాదు కానీ ఓ ఎమోషన్. ఎంతో గొప్ప మేధావి అతి తక్కువ వయసులో ఈ లోకాన్ని విడిచ్చి వెల్లిపోవటం అనేది నేను ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాను .. అతను కమెడియన్ మాత్రమే కాదు ఆయన వేసే పంచులు ఊహించిన విధంగా ఉంటాయంటూ ఆయన గురించి మాట్లాడితూ బ్రహ్మానందం ఎమోషన్ కు గురయ్యారు.