![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/manchu-mohan-babu-vishnu-surya-biopice29d711c-ffbb-4d95-8a90-d6321644c2c2-415x250.jpg)
ఒకవేళ తన తండ్రి బయోపిక్ తీస్తే అందులో కచ్చితంగా ఒక లీడ్ రోల్లో హీరో సూర్యతో చేయించాలనుకుంటున్నాను అంటూ మంచు విష్ణు వెల్లడించారు. అయితే ప్రొడ్యూసర్ గా కూడా తానే ఉంటానని తెలిపిన మంచు విష్ణు ఈ విషయాన్ని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కంగువా చిత్రం టీజర్ చూసి తాను చాలా ఆశ్చర్యపోయాననీ అందులో సూర్య అద్భుతంగా నటించి అభిమానులను సర్ప్రైజ్ చేశారని.. విజువల్స్ వండర్ గా కండువా ఉందని తెలిపారు. ప్రస్తుతమైతే తన తండ్రి బయోపిక్ తీయడానికి సిద్ధంగా లేము ఒకవేళ తీస్తే కచ్చితంగా అది సూర్యాతోనే తీస్తామంటూ తెలిపారు.
అయితే ఇందుకు సూర్య ఒప్పుకుంటారా లేదా అనే విషయం మోహన్ బాబు అభిమానులను డౌట్ల పడేసింది.ఎందుకంటే మోహన్ బాబు సినీ కెరియర్ డౌన్ టు ఎర్త్ అన్నట్లుగా సాగింది ఒక చిన్న నటుడుగా తన కెరీర్ ని మొదలు పెట్టి ఎన్నో కష్టాలు ఒడిదుడుకులను సైతం ఎదుర్కొని ఈ స్టేజిలో ఉన్నారు. 500 కు పైగా చిత్రాలను నటించిన మోహన్ బాబు తన వ్యక్తిగత జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులను కూడా ఎదుర్కొన్నారు. భవిష్యత్తులో తన తండ్రి పైన ఉన్న అభిమానం గౌరవంతోనే బయోపిక్ ని రూపొందిస్తామంటూ తెలిపారు.ఇందులో ఎలాంటి సందేహం లేదని కూడా తెలిపారు.