మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారలేదు. తాజాగా మోహన్‌ బాబు యూనివర్సిటీ ముందు నిరసన తెలిపిందుకు ప్రయత్నించారు మంచు మనోజ్‌. ఈ సందర్భంగా తన కుటుంబ సభ్యులపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంచు మనోజ్‌. సినిమా ఈవింట్ కోసం రాయచోటి వెళ్ళానని వెల్లడించారు. ఆడియో ఫంక్షన్ సమయంలో తొక్కేస్తున్నారని మాట్లాడానని గుర్తు చేశారు. నా మద్దతుగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

లోన్ ,అప్పులు చేసి షాపులు పెట్టుకున్న వారిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు మంచు మనోజ్‌.  హేమాద్రి నాయుడు కొట్టి డబ్బులు వసూళ్లు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. Mbu పిఆర్వోగా వ్యక్తి ఆడవాళ్ళను  టార్గెట్ గా చేసుకుని ఈ పనులు చేస్తున్నారని మండిపడ్డారు మంచు మనోజ్‌.  నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాంబ్‌ పేల్చారు.  నేను ఆస్తుల కోసం పోరాటం చేయడం లేదని..... ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్రంలో బౌన్సర్లు లేకుండా చేశారని ఆగ్రహించారు. మోహన్‌ బాబు యూనివర్సిటీలో మాత్రమే వందల మంది బౌన్సర్ రాత్రి అయితే మందులు తాగి నానా రచ్చ చేస్తు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నిప్పులు చెరిగారు‌. మళ్ళీ బౌన్సర్లు వర్శిటి వద్ద నా మద్దతు గా ఉన్న వారి షాపులను కర్రలు, రాడ్డులతో దాడు చేశారని ఆరోపణలు చేశారు. దీనిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పందించాలని డిమాండ్‌ చేశారు.

స్దానికులకు దైర్యం చెప్పాల్సిన బాధ్యత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపైన ఉందన్నారు‌. బౌన్సర్ లేకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వం పైనా ఉందని తెలిపారు. ప్రేమను పంచండి.... ద్వేషాన్ని కాదని ఆగ్రహించారు. పోలీసులకు ఘటనపై ఫిర్యాదు చేస్తానన్నారు మనోజ్‌ మంచు. ఇక ఈ సంఘటన పై ఆరా తీస్తున్నారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని.   అసలు ఏంటీ ఈ గొడవ... ఏం జరిగిందనే దానిపై తెలుసుకుంటున్నారని సమాచారం అందుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: