టాలీవుడ్‌ స్టార్‌ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. హ్యాపీ డేస్ సినిమాతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్న తమన్నా వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తుంది. ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి పరిచయమై దాదాపు 20 ఏళ్లకు పైనే అవుతుంది. అయినప్పటికీ ఏమాత్రం తరగని అందం, సిట్నెస్ కొనసాగిస్తూ తన సత్తాను చాటుకుంటుంది.

తన దైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ చిన్నది స్టార్ హీరోల సరసన ఆడి పాడింది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. కాగా, తమన్నా చాలా కాలం నుంచి వివాహం చేసుకోకుండా సింగిల్గానే ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా చాలా కాలం నుంచి ప్రేమలో మునికి తేలుతోంది. వీరి ప్రేమ విషయాన్ని తమన్నా బహిరంగంగా ఒప్పేసుకుంది.


వీరిద్దరూ బయట షికార్లకు వెళ్లడం, వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటారని ఎన్నో రకాల వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఇంకా వివాహం చేసుకోకపోవడం విశేషం. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. వివాహమైన తర్వాత ఇద్దరు కలిసి ఉండడానికి ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన ఫ్లాట్ కూడా కొనుగోలు చేశారట.


ఇక తొందర లోనే విజయ్ వర్మ, తమన్నా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇదిలా ఉండగా.... ఈ రోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం కారణంగా తమన్నా విజయ్ వర్మ ఇద్దరూ కలిసి వాలెంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి దుబాయ్ కి వెళ్ళారట. అక్కడ ఓ ఖరీదైన హోటల్ లో సెలబ్రేషన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం విజయ్ వర్మ, తమన్నాకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: