తన సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక హడావిడి చేస్తుంటాడు యువ హీరో విశ్వక్ సేన్. ప్రతి సినిమా రిలీజ్ ముందు ఏదో ఒక విషయంలో విశ్వక్ వివాదాలు తెలిసిందే. ఐతే ఈ గొడవలు కొన్ని సినిమాలకు ప్లస్ అయ్యాయి కానీ మరికొన్నిటికి మాత్రం నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా విశ్వక్ సేన్ లైలా సినిమా రిలీజ్ టైం లో అనవసరంగా పృధ్విరాజ్ చేసిన కామెంట్స్ కొందరిని హర్ట్ చేశాయి. ఇక అప్పటి నుంచి బాయ్ కాట్ లైలా అంటూ ట్రెండ్ చేశారు.

సినిమాకు ఇలా అయినా పబ్లిసిటీ వస్తుందని అనుకున్నారు కానీ అసలకే మోసం వస్తుందని ఊహించలేకపోయారు. ఇదిలాఉంటే లైలా సినిమా చూసిన కామన్ ఆడియన్స్ అసలు సినిమాలో మ్యాటర్ ఏమి లేదని అంటున్నారు. అసలు విశ్వక్ సేన్ ఎందుకు ఈ సినిమా చేశాడని అంటున్నారు. లైలా పాత్రలో విశక్ ఇదేదో గొప్ప ప్రయోగం అనుకున్నాడు కానీ అది ఏమాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.

అసలే సినిమా బాగాలేదు అంటుంటే దీనికి తోడు బాయ్ కాట్ లైలా వివాదం ఒకటి తోడైంది. ఇప్పుడు బాయ్ కాట్ లైలా కాదు డిజాస్టర్ లైలాని ట్రెండ్ చేస్తున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు వరకు ఈ సినిమా లెక్క వేరేలా ఉండగా ఈవెంట్ లో పృధ్వి చేసిన కామెంట్స్ వల్ల సినిమా ఫేట్ మార్చేశాయి. ఐతే లైలా చుట్టూ ఏర్పడిన ఈ వివాదాలు సినిమాకు ప్లస్ అవుతాయని అనుకుంటే సినిమాలో మ్యాటర్ లేకపోవడం వల్ల ఇంకాస్త ఎఫెక్ట్ పడేలా చేశాయి. లైలా రివ్యూస్ కూడా ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ప్రేక్షకులు మరి సినిమా చూడటానికి సాహసం చేస్తారా లేదా అన్నది చూడాలి. విశ్వక్ సేన్ ఖాతాలో లైలా మరో ఫ్లాప్ సినిమాగా పడింది. యువ హీరో కెరీర్ రిస్క్ లో పడుతుందని చెప్పేందుకు ఈ వరుస ఫ్లాపులే ఎక్సాంపుల్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: