![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/krithy-a5fee83d-47d5-4148-b817-820fd5c83310-415x250.jpg)
లాస్ట్ ఇయర్ శర్వానంద్ తో మనమే సినిమా చేసిన కృతి శెట్టి ఆ తర్వాత ఒక్క అవకాశాన్ని అందుకోలేదు. ఐతే కృతి శెట్టి ఈమధ్య గ్లామర్ షోకి రెడీ అనేస్తుంది. అందుకే ఫోటో షూట్స్ లో ఇదివరకు కన్నా ఇప్పుడు రెచ్చిపోతూ ఫోటో షూట్స్ చేస్తుంది. తన ఫాలోవర్స్ ని తన అందాల మాయలో పడేసుకుంటూ గ్లామర్ ట్రీట్ అందిస్తుంది కృతి శెట్టి.
లేటెస్ట్ గా అమ్మడు వైట్ కలర్ డ్రెస్ లో థై షోతో పిచ్చెక్కిస్తుంది. చేతిలో బంతి పూలతో కృతి శెట్టి అదుర్స్ అనిపిస్తుంది. ఉప్పెన తర్వాత కాస్త మంచి కథలను చూసి ఎంపిక చేసింటే ఇప్పుడు అమ్మడి కెరీర్ ఒక రేంజ్ లో ఉండేది. కానీ కృతి శెట్టి వచ్చిన ప్రతి సినిమా చేస్తూ వచ్చింది. అందుకే ఆమెకు అవకాశాల్లేక ఖాళీ అయ్యింది. ఐతే కెరీర్ లో మరో హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్న కృతి శెట్టికి అది ఎవరు ఇస్తారన్నది చూడాలి. ఈమధ్యనే మలయాళంలో ఏ.ఆర్.ఎం సినిమా చేసిన కృతి శెట్టి తమిళ్ లో రెండు సినిమాలు కమిటైంది. మరి అక్కడ అయినా అమ్మడికి లక్ కలిసి వస్తుందా లేదా అన్నది చూడాలి.
బేబమ్మ మాత్రం మళ్లీ తిరిగి ఫాం లోకి వచ్చే దాకా ఫోటో షూట్స్ తో అదరగొట్టాలని ఫిక్స్ అయ్యింది. మరి అమ్మడికి ఎవరు ఛాన్స్ ఇస్తారో చూడాలి.