
గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చరణ్ దగ్గర నుంచి వారసుడుని కోరుకోవడం తప్పులేదు. అయితే పబ్లిక్ గా అలా ఎలా మాట్లాడగలరు . కూతురు పుట్టేస్తుందేమో అని భయంగా ఉంది అనడం చాలా చాలా తప్పు అంటూ జనాలు మాట్లాడుతున్నారు. అంతేకాదు అంత పెద్ద మెగాస్టార్ ఎలా అలా మాట్లాడగలరు అంటూ ఫైర్ అవుతున్నారు . కూతుర్లు పుడితే శాపమా..? తప్పా..? అంటూ దారుణంగా ఆయన మాట్లాడిన మాటలను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
కొంత మంది మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలను పాజిటివ్ గానే తీసుకుంటున్నారు . ప్రతి ఒక్కరికి వారసుడు కావాలి అని ఉంటుంది అని .. చిరంజీవి కూడా అందుకు అతీతం కాదు అని అంటున్నారు. అయితే అంత పెద్ద స్థాయిలో ఉన్న చిరంజీవి అలా అందరి ముందు నోరు విప్పడమే తప్పయింది అంటూ మాట్లాడుతున్నారు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం అస్సలు ఏమాత్రం తగ్గడం లేదు . మెగాస్టార్ ఏం చేసినా ఆయన కుటుంబం మంచి కోసమే అని ఆయన మెగాస్టార్ అయ్యుండొచ్చు.. అయితే ఆయన తండ్రి కూడా అని .. ఒక తండ్రికి తన కొడుకు కొడుకు పుడితే చూడాలి అని ..తమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్న ఆలోచన ఉంటుంది అని .. ఆ విషయం ఓపెన్ గా చెప్పడంలో తప్పులేదు అని .. ఎవరు ఏం చేసినా మెగాస్టార్ ఇమేజ్ ని ఇంచు కూడా పీకలేరు తగ్గించలేరు అంటూ మెగా ఫ్యాన్స్ ఘాటు గానే బెదిరిస్తున్నారు . మొత్తానికి చిరంజీవి మాట్లాడింది పాజిటివా..? నెగిటివ్ నా..?పక్కన పెడితే నెగిటివ్ ట్రోలింగ్ జరుగుతున్న సరే మెగా ఫాన్స్ ఇంచు కూడా భయపడకుండా మెగాస్టార్ ని సపోర్ట్ చేస్తూ ఉండడంతో ఈ న్యూస్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది.