నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే .. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ విజ‌య‌లు  అందుకున్నాయి .. వాటిలో మరి ముఖ్యంగా అఖండ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీస్ ను షేక్ చేసి పడేసింది . అలాగే అఖండ సినిమా దగ్గరనుంచి బాలయ్య వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుని దూసుకుపోతున్నాడు .. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్‌ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి మరో బంపర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.


బోయపాటి సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని తో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది .. అయితే ఇదే క్రమంలో టాలీవుడ్ లో మాస్ కమర్షియల్ సినిమాలు తీయటంలో మంచి క్రేజ్‌ తెచ్చుకున్న హరీష్ శంకర్ .. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ తో తన తడాఖా ఏంటో చూపించాడు .. అయితే ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం ఈ దర్శకుడు దక్కలేదు .. రీసెంట్గా మిస్టర్ బచ్చన్ సినిమా చేశాడు ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరిచింది .. ఇక ఇప్పుడు బాలకృష్ణతో ఓ సినిమా చేస్తానని ఎప్పటినుంచో హరీష్ చెబుతున్నాడు .. అయితే ఇప్పుడు అది ఎట్టకేలకు కన్ఫర్మ్ అయిందని ఇన్సైడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం .. బాలయ్యకు హరీష్ ఒక కథ చెప్పాడట అది ఆయనకు ఎంతో నచ్చిందని .. ఈ సినిమాను కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించబోతుందట .. ప్రస్తుతం యాశ్‌ హీరోగా టాక్సిక్ సినిమాని రూపొందిస్తుంది ఈ నిర్మాణ సంస్థ .. ఇక ఇప్పుడు తెలుగులో కూడా ఒక సినిమా చేయాలని భావిస్తుంది ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.


అలాగే టాలీవుడ్లో హరీష్ శంకర్ కు రీమేక్ దర్శకుడు అన్న ముద్ర కూడా ఉంది .. ఆయన చేసిన సినిమాలు ఎక్కువ శాతం రీమేక్లే .. సూపర్ హిట్ అయిన గబ్బర్ సింగ్ ప్లాఫ్‌న మిస్టర్ బచ్చన్ కూడా రీమేక్ స్టోరీలే . అయితే ఇప్పుడు ఈసారి బాల‌య్య‌ కోసం కొత్తగా ఓ క‌థ‌ రాసాడు అని తెలుస్తుంది .. రీమేక్ జోన్ లో నుంచి బయటకు రావడానికి హిట్ బాట పట్టడానికి హరీష్ శంకర్ కు వచ్చిన మంచి అవకాశం ఇది .. పైగా బాలకృష్ణ కూడా ప్రస్తుతం భారీ ఫామ్ లో ఉన్నారు ఆయన పట్టిందల్లా బంగారం అయిపోతుంది .. హరి శంకర్ కు కూడా ఇంతకంటే మంచి టైమింగ్ కూడా దొరకదు .. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికార డీటెయిల్స్ కూడా బయటకు రాబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: