![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/acter-rahuravindran-father-nomore319046cb-abdd-42b3-b648-e6b2530e36a5-415x250.jpg)
కష్టపడి నిజాయితీగా మంచి జీవితాన్ని గడిపినటువంటి నీ జ్ఞాపకాలు తనలో ఎప్పుడు బ్రతికే ఉంటాయి నాన్న అంటూ రాహుల్ రవీంద్ర ఒక ఎమోషనల్ నోట్ ని రాసుకురావడం జరిగింది.. ఈ విషయం విన్న పలువురు సెలబ్రిటీలు కూడా రాహుల్ తండ్రికి సంతాపాన్ని సైతం తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలోనే రాహుల్ రవీంద్రనాథ్ ధైర్యంగా ఉండాలి అంటు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే తన తండ్రి మరణించిన సమయంలో కూడా తాను తెరకెక్కించిన చీ.లా.సౌ అనే సినిమాలోని ఒక సన్నివేశాన్ని తెలియజేశారు..
నాన్న ఉన్నారులే అన్ని చూసుకుంటారని మాట విలువ తండ్రి కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుందని ఆ విషయం తనకి ఈరోజు అర్థమవుతుందంటూ రాహుల్ రవీంద్ర తెలిపారు. రాహుల్ రవీంద్ర నటుడు గానే కాకుండా డైరెక్టర్గా కూడా పేరు సంపాదించారు. 2012లో అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రాహుల్ రవీంద్ర ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించారు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు. రాహుల్ రవీంద్ర ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను ప్రేమించి మరి వివాహం చేసుకున్నారు వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. చిన్మయి కూడా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో కూడా పనిచేసినట. ప్రస్తుతం రాహుల్ రవీంద్ర తండ్రి మరణ వార్త వైరల్ గా మారుతున్నది.