![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mega-heroesa0a7c8de-ac1f-4103-96da-fc3d5da51e4d-415x250.jpg)
అది కూడా అలాంటి ఇలాంటి హిట్ కాదు పవన్ కళ్యాణ్ అభిమానుల 10 సంవత్సరాల నిరీక్షణకు తెరాదించిన చిత్రం గబ్బర్ సింగ్ .. బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది .. ఈ సినిమా హిట్ అవ్వటం శృతిహాసన్ కి ఎంతో ముఖ్యమో పవన్ కళ్యాణ్ కూడా అంతే కీలకం పదేళ్లుగా వరుస ప్లాప్‌లతో సతమతమవుతున్న పవన్ కి సాలిడ్ విజయం దక్కింది. ఇక ఈ సినిమా తర్వాత శృతిహాసన్ నటించిన సినిమాల బ్లాక్బస్టర్ అవుతూ వచ్చింది . తెలుగులో ఈమె 15 సినిమాల్లో హీరోయిన్గా నటించింది . అలాగే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది .. హీరోయిన్గా నటించిన 15 సినిమాల్లో 11 విజయాలు అందుకుంది శృతి .. దీన్నిబట్టి ఆమె హిట్ ట్రాక్ రికార్డు ఏంటో అర్థం చేసుకోవచ్చు .. ఐరన్ లెగ్ అని విమర్శించిన వారే లక్కీ హీరోయిన్ అని ప్రశంసలు కురిపించారు. అయితే టాలీవుడ్ లో మెగా కుటుంబానికి శృతిహాసన్ నిజంగానే లక్కీ హీరోయిన్గా మారింది ..
మెగా ఫ్యామిలీలో శృతిహాసన్ పవన్ కళ్యాణ్ , చిరంజీవి , అల్లు అర్జున్ , రామ్ చరణ్ తో సినిమాలు చేసింది .. వీరందరితో బ్లాక్ బస్టర్ విజయాల్లో నటించడం విశేషం .. పవన్ తో గబ్బర్ సింగ్ , వకీల్ సాబ్ , రామ్ చరణ్ తో ఎవడు ,అల్లు అర్జున్ తో రేసుగుర్రం , చిరంజీవితో వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్బస్టర్ సినిమాలో నటించింది. అలాగే శృతిహాసన్ మెగా ఫ్యామిలీ కాకుండా టాలీవుడ్ లో రవితేజతో కూడా బలుపు , క్రాక్ వంటి హిట్ సినిమాలో నటించింది .. అలాగే ప్రభాస్ తో సలార్ బాలయ్యతో వీరసింహారెడ్డి సినిమాలో కూడా మంచి విజయాలు అందుకున్నాయి.. మహేష్ తో చేసిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచింది .. ఇలా శృతిహాసన్ నటించిన 15 సినిమాల్లో 11 సినిమాలు భారీ విజయాలు అందుకుని అమెను లక్కీ హీరోయిన్గా చేశాయి.