రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వాలంటైన్స్ డే సందర్భంగా ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. వాలంటైన్స్ డే అనేది 22 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయస్సు ఉన్న అమ్మాయిలకు సంబంధించినది అని ఉపాసన వెల్లడించడం గమనార్హం.
 
మీరు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లు అయితే ఆంటీ దయచేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కోసం ఎదురుచూడండని ఉపాసన వెల్లడించారు. ఉపాసన చెప్పిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ఉపాసన వ్యాపారవేత్తగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించడంతో పాటు మంచి లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం.
 
రామ్ చరణ్ కు తగిన భార్యగా ఉపాసన మంచి పేరును సంపాదించుకున్నారు. వాలంటైన్స్ డే వేడుకలను సెలబ్రిటీలు సైతం ఎంతో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రామ్ చరణ్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్నారు. కోడి రామ్మూర్తి నాయుడు జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
 
ఈ ఏడాదే చరణ్ బుచ్చిబాబు కాంబో మూవీ రిలీజ్ కావాలని ఫ్యాన్స్ భావిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో క్లైమాక్స్ కొత్తగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నరని సమాచారం అందుతోంది. అటు చరణ్ ఇటు బుచ్చిబాబు కోరుకుంటున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను ఈ సినిమా అందిస్తుందేమో చూడాల్సి ఉంది. రామ్ చరణ్ గత సినిమా గేమ్ ఛేంజర్ నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలను మిగిల్చింది. దిల్ రాజు కెరీర్ లో గతంలో ఏ సినిమా షాకివ్వని స్థాయిలో ఈ సినిమా షాకిచ్చిందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదని కచ్చితంగా చెప్పవచ్చు.




మరింత సమాచారం తెలుసుకోండి: