పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే పీరియడ్ యాక్షన్ డ్రామా హరి హరా వీర మల్లులో కనిపించనున్నారు. గత కొన్ని రోజులుగా, ఈ చిత్రం ప్రారంభంలో ప్రకటించిన తేదీన విడుదల కాదు అని ఊహాగానాలు వచ్చాయి.ఈ క్రమంలో నే ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రాజెక్ట్‌లలో హరిహర వీరమల్లు ఒకటి.పిరియడికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాను 2025 మార్చి 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. గతనెలలో ఈ సినిమా నుండి స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన మాట వినాలి అనే ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్‌ను పంచుకుంది.ఇక నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రెండో పాటకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది.

కొల్లగొట్టినాదిరో అంటూ రెండో పాట పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పాటను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈపోస్టర్‌లో నిధి అగర్వాల్ ను పవన్ పొడుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్‌గా మారింది.క్రిష్ జాగర్లమూడి ఈ చిత్ర సగభాగానికి పైగా దర్శకత్వం వహించారు. అయితే.. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.ఇదిలావుండగా రెండు భాగాలుగా వస్తున్న ఈ చిత్రం మొదటి పార్ట్ 'హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, నర్గీస్ ఫక్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: