![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/chiranjeevi8703a613-9927-49bf-949d-e50a8bdd6d4f-415x250.jpg)
మెగాస్టార్ చిరంజీవి పదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండి 2017 సంక్రాంతి కానుకగా వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా అప్పటికే తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన కత్తి సినిమాకు రీమేక్గా వచ్చింది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడినా. రీమిక్స్ సినిమా కావడంతోపాటు చిరు స్థాయికి తగిన సినిమా కాకపోవడంతో అనుకున్నంత పేరు రాలేదు. ఆ తర్వాత చిరంజీవి నటించిన సైరా, నరసింహారెడ్డి, ఆచార్య, భోళాశంకర్ సినిమాలు చిరంజీవి పరువును పూర్తిగా దిగజార్చేశాయి.
అసలు చిరంజీవి ఇలాంటి సినిమాలు ఎందుకు చేస్తున్నాడు అని మెగా ఫ్యామిలీ వీరాభిమానులు సైతం తలలు పట్టుకున్న పరిస్థితి. మధ్యలో బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా ఒక్కటి మాత్రం చిరు రీఎంట్రీలో ఊపిరి ఊదిన సినిమాగా చెప్పాలి. అయితే అందులో మాస్ మహారాజ్ రవితేజ కూడా ఉన్నాడు. పూర్తిగా చిరంజీవికి క్రెడిట్ ఇచ్చేయటం కుదరదు. ఇక చిరంజీవి దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే జగదేకవీరుడు అతిలోకసుందరి తర్వాత మరోసారి విశ్వంభర సినిమాతో సోషియో ఫాంటసీ సినిమా చేస్తున్నాడు.
బింబిసారా సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు మల్లిడి వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గత ఏడాది రిలీజ్ కావాల్సి ఉంది. వాయిదా పడి సంక్రాంతికి అన్నారు. సంక్రాంతికి కూడా రాలేదు. సమ్మర్లో అనుకుంటున్నా.. సమ్మర్ కు అయినా వస్తుందా.. రాదా.. అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. సినిమా సీసీ వర్క్ చాలా వీక్‌గా ఉందని చెబుతున్నారు. సినిమా మీద ఎన్ని కసురత్తులు చేస్తున్న చిరంజీవికి సైతం విషయంలో అంత నమ్మకం లేదని.. టాలీవుడ్ వర్గాలలో గుసగుసలు కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా అవాంతరాలు దాటుకుని ఎప్పుడు ధియేటర్లలోకి వస్తుందో చూడాలి.