![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/hit-director-busy-with-story-work-for-balayyad9ead19d-9c5b-4845-bac6-30a8576d7709-415x250.jpg)
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా.. అఖండ అదరగొట్టేసింది. అఖండ సినిమా నుంచి బాలయ్య వరుసగా నాలుగు సూపర్ డూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ కొట్టారు.
రూ.180 కోట్లు రాబట్టిన డాకు మహారాజ్ సినిమా.. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డులకెక్కింది. ఇదిలా ఉంటే అఖండ 2 తాండవం సినిమా తర్వాత.. బాలయ్య తనకు వీరసింహారెడ్డి లాంటి మాస్ హిట్ సినిమా ఇచ్చిన.. మలినేని గోపీచంద్ దర్శకత్వం లో మరో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బాలయ్య, గోపిచంద్ కాంబినేషన్లో వచ్చిన వీర సింహారెడ్డి , చిరంజీవి .. వాల్తేరు వీరయ్య సినిమాను ఢీకొట్టి మరి బాక్సాఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది.
ఈ క్రమంలోనే మరోసారి బాలయ్య తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్న గోపీచంద్.. తన డైరెక్షన్ టీంతో కలిసి బాలయ్య సినిమా కోసం కథ రెడీ చేసే పనులు బిజీ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా గోపీచంద్ బాలయ్య ఇమేజ్‌కు తగినట్టుగా అదిరిపోయే మాస్ స్టోరీతో పాటు.. భయంకరమైన ఎలివేషన్లతో కథ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఈ ఏడాది దసరా నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక అఖండ 2 తాండవం సినిమా దసరాకు రిలీజ్ చేయనున్నారు.