మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎలాంటి సినీ నేపథ్యం లేని కుటుంబం నుంచి సినిమాల్లోకి వచ్చిన మెగాస్టార్ తన సినిమాల ద్వారా ఎంతోమందికి ఇన్స్పిరేషన్ గా మారాడు. సినిమాల్లోకి రావాలనుకునే వారికి గాడ్ ఫాదర్ గా అండగా నిలుస్తాడు. చిరంజీవి తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా తన సినిమాలతో ఎంతోమంది హీరోయిన్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.


యంగ్ హీరోయిన్ల నుంచి స్టార్ హీరోయిన్లతో సినిమాలలో నటించారు. తన సినిమాల ద్వారా ఎంతో మంది కొత్త డైరెక్టర్లను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం చిరంజీవి మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా దర్శకుడు అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమాను చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథను సిద్ధం చేశారు డైరెక్టర్ అనిల్ రావిపూడి.


త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ని ప్రారంభించబోతున్నారట. 2026 సంక్రాంతి కానుకగా చిరంజీవి - అనిల్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అన్ని పనులను ప్రారంభిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నయనతారను ఫిక్స్ చేశారు. నయనతార అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ల జాబితాలో ముందు వరుసలో ఉంది.


అయినప్పటికీ నయనతార అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార మాత్రమే కాకుండా యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్ గా చేయబోతుందట. స్టార్ హీరోయిన్ త్రిష ఐటమ్ సాంగ్ చెయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమా షూటింగ్ అతి త్వరలోనే ప్రారంభం కానుంది. దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: