![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/kindom0fcf6177-2e8b-4bb1-8ca7-8b8816081c20-415x250.jpg)
జెర్సీ లాంటి సెన్సిటివ్ సినిమా తర్వాత గౌతమ్ ఇప్పుడు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సౌజన్య, నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కింగ్డమ్ సినిమా మే 30న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ తో ప్రేక్షకుల్లో కింగ్ డమ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. లైగర్ సినిమా అనంతరం విజయ్ దేవరకొండ నుంచి కింగ్డమ్ సినిమా రిలీజ్ అవుతుంది. కాగా, కింగ్డమ్ సినిమా ఇండియా, శ్రీలంక సరిహద్దులలో జరిగే కథగా చెబుతున్నారు. తన చిన్న తనంలో అణచివేతకు గురైన హీరో ఒకానొక దశలో శరణార్థులపై క్రూరంగా ప్రవర్తించే సింహాలి సైనికుల మీద హీరో విజయ్ దేవరకొండ పోరాడుతాడు.
అయితే ఈ స్టోరీ లైన్ విన్న అనంతరం కొంతమంది ప్రభాస్ చత్రపతి సినిమాతో కింగ్డమ్ సినిమాను పోలుస్తున్నారు. అయితే చత్రపతి సినిమా లైన్ వేరు. దానికి మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా చాలా దశలో లేయర్స్ యాడ్ చేశారు. కాగా, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమా టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరుగుతున్నాయి.