![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/re-release-date-of-sithamma-vakitlo-sirimalle-chettu4fb89fee-826a-4cc2-8090-14d4364de44d-415x250.jpg)
టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమా లకు నాటి నుంచి నేటి వరకు ఎప్పుడూ కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుంది. ఇక ఒకప్పుడు హీరో లు తమ మధ్య ఎంత పోటీ ఉన్నా కూడా మల్టీస్టారర్ సినిమా లలో కలిసి నటించే వారు. ఆ తర్వాత తరం హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయలేదు. ఇక సీనియర్ హీరోలలో విక్టరీ వెంకటేష్ ఒక్కడు మాత్రమే ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు చేశారు. ఈ క్రమంలో నే వెంకీ నటించిన క్లాసిక్ మల్టీస్టారర్ సినిమా ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ సినిమా 2013 జనవరి 11న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. ఈ సినిమాలో స్టార్ హీరోలు విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు అన్నదమ్ములుగా నటించారు.
తెలుగు సినిమా చరిత్ర లో ఈ సినిమా ది బెస్ట్ మల్టీస్టారర్ సినిమా లలో ఒకటిగా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై అగ్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రెస్టేజియస్ మల్టీ స్టారర్ సినిమా ను నిర్మించారు. అయితే .. ఇప్పుడు ఈ సినిమా రీ - రిలీజ్‌కు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. సినీ సర్కిల్స్‌లో ఈ సినిమా రీ -రిలీజ్ పై వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి క్లాసిక్ సినిమా ఖచ్చితంగా రీ - రిలీజ్ చేయాలని ప్రేక్షకుల తో పాటు సినీ లవర్స్ కూడా కోరుతున్నారు. ఈ క్రమం లోనే మేకర్స్ ఈ సినిమా ను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకున్నట్లు కుదిరితే మార్చి 7న ‘ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ’ మరోసారి ప్రేక్షకులను అలరించడం ఖాయం.