విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన లైలా సినిమా ఈరోజు ప్రేక్షకులు ముందుకు వచ్చింది .. ఈ సినిమా రిలీజ్ కి ముందు ఎలాంటి వివాదాలో చిక్కుకుందో అందరికీ తెలిసింది .. ఈ వివాదాలకు సద్ది చెప్పడానికి హీరో ప్రెస్మీట్ పెట్టి సారీ చెప్పిన ఎలాంటి లాభం లేదు . ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో 30 ఇయర్స్ పృద్వి చేసిన వ్యాఖ్యలు ఓ రాజకీయ పార్టీ కార్యకర్తలను ఎంతగానో బాధించాయి .. చివరికి పృద్వి సారీ చెప్పిన రచ్చ ఆగలేదు .. లైలా సినిమా పై సోషల్ మీడియా లో వారు ఆగ్రహం కనిపిస్తూనే ఉంది .. నిన్నటి వరకు బాయికాట్ లైలా అంటూ ట్రెండ్ నడవగా .. గత రాత్రి నుంచి డిజాస్టర్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ వచ్చింది .


ఈ వ్యవహార విశ్వక్ సేన్ సినిమా పై గట్టిగా పడింది .. ఇక దీంతో చివర నిమిషం లో పృథ్వీ లైన్లోకి వచ్చి తన వ్యాఖ్యల్ని వెనుక తీసుకుంటున్నా ని ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే సారీ అంటూ బహిరంగంగా క్షమాపలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు . ఇకపై బాయికాట్ లైలా అనకుండా వెల్కమ్ లైలా ఆనాలని సినిమాను పెద్ద హీట్ చేయాలని పిలుపునిచ్చారు .. అయితే పృద్వి పై ఇంకా చాలామందికి కోపం తగ్గలేదు .. దీంతో ఈరోజు రిలీజ్ అయిన లైలా సినిమాపై డిజాస్టర్ లైలా అని హ్యాష్ ట్యాగ్  ట్రెండ్ చేస్తూ వస్తున్నారు . ఇలా తీవ్ర వ్యతిరేకత మధ్య ఈరోజు ధియేటర్లోకి వచ్చింది లైలా. మొదటిసారిగా విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించారు . అయితే మొదటి నుంచి వస్తున్న నెగటివ్ టాక్ ప్రభావం కారణం గా లైలా మూవీ మొదటి ఆట నుంచి భారీ డిజాస్టర్ టాక్ ను తెచ్చుకుంది . ఈ సినిమాకు అన్ని రివ్యూలు కూడా ప్లాప్‌ రివ్యూలు ఇచ్చాయి . ఇక దీంతో విశ్వక్ సేన్ లైలా తో మరో డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నట్టు అయ్యింది .

మరింత సమాచారం తెలుసుకోండి: