ప్రముఖ యాంకర్ శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన హోస్టింగ్ తో గ్లామర్ క్వీన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్యామల సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంది. ఓవైపు హోస్టింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లోనూ నటించింది. శ్యామల తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. మొదట సీరియల్స్ తో తన కెరీర్ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిగా పరిచయమైనప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు.


అనంతరం బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించి సక్సెస్ఫుల్ యాంకర్ గా తన కెరీర్ కొనసాగించింది. ఇక తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే నటుడు నరసింహా రెడ్డిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఓ అబ్బాయి కూడా ఉన్నాడు. ప్రస్తుతం శ్యామల ఓవైపు తన కుటుంబాన్ని చూసుకుంటూనే మరోవైపు సినిమాలలో నటిస్తోంది. అంతేకాకుండా వైసీపీలో కీలక పదవిని తీసుకొని తెలుగుదేశం కూటమి నేతలను ఆటాడిస్తోంది.


రఫ్ అండ్ టఫ్ గా మాట్లాడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ ఉంటుంది. కాగా, ఈ నేపథ్యంలోనే శ్యామలకు సంబంధించిన కొన్ని ఫోటోలను తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా వ్యక్తులు ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. శ్యామల పాత ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఓ ఆట ఆడుకుంటున్నారు. గతంలో పిఠాపురంలో రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే శ్యామల ఇప్పుడు ప్రత్యర్ధులను ఉద్దేశించి నోటికి వచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పు అని అంటున్నారు.


రికార్డింగ్ డ్యాన్సులు చేయడం తప్పు కాదు కానీ సంబంధం లేకుండా నోటికి వచ్చినట్టు విమర్శలు చేయడం చాలా తప్పు యాంకర్ శ్యామల ఆంటీ అంటూ తన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం శ్యామలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై శ్యామల ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: