![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/naga-chaitanya-thandel8b4a929e-97d1-40fb-98cf-db146a388349-415x250.jpg)
గీత ఆర్ట్స్ సంస్థ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు ప్రేక్షకులు ఎంతగానో ఫిధా అవుతున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. కాగా, ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలోనే వంద కోట్ల కలెక్షన్ల వైపుకు దూసుకుపోతోంది. ఈ సినిమాను కేవలం రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా... విడుదలైన ఏడు రోజుల్లోనే రూ. 90. 12 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లుగా మేకర్స్ రివీల్ చేశారు.
ముఖ్యంగా ఈరోజు లవర్స్ డే కావడంతో ప్రేమికులు ఈ సినిమాను చూడడానికి థియేటర్లకు తరలివస్తున్నారు. దీంతో తండెల్ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. అంతేకాకుండా వీకెండ్ కావడంతో మరో రెండు రోజులు థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అవుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, నాగచైతన్య కెరీర్ లోనే అత్యంత వేగంగా కలెక్షన్లు సాధించిన సినిమాగా తండేల్ చిత్రం నిలిచింది. ఈ సినిమాతో నాగచైతన్య మంచి విజయాన్ని అందుకున్నాడు. అదే సక్సెస్ తో తను నాగచైతన్య మరిన్ని సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా, ఈ సినిమా సక్సెస్ మీట్ ని రీసెంట్ గా నిర్వహించారు. దీనికి గెస్ట్ గా అక్కినేని నాగార్జున రావడం విశేషం. అందులో భాగంగా నాగార్జున చాలా సంతోషంలో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. వివాహం తర్వాత నాగచైతన్య అదృష్టం చాలా బాగుందని అన్నారు. శోభిత రాకతో చైతు సక్సెస్ సాధించాడని నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాగార్జున చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.