టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అక్కినేని నాగార్జున ఒకరు. మన్మధుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగార్జున తన సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ముఖ్యంగా నాగార్జున అంటే అమ్మాయిలకు విపరీతంగా పిచ్చి. తన అందానికి, నటనకు, తన స్టైల్ కు చాలా ఈజీగా పడిపోతూ ఉంటారు. నాగార్జున తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు. ఎంతోమంది హీరోయిన్ల సరసన నటించి మంచి గుర్తింపును పొందారు.


ఇక నాగార్జున, టబు కాంబినేషన్లో రిలీజ్ అయిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా అప్పట్లోనే పెద్ద సంచలనాలు సృష్టించింది. బ్లాక్ బస్టర్ రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా వల్ల నిర్మాతలు భారీగా లాభపడ్డారు. కాగా, ఈ సినిమాలో పాటలకు అభిమానులు ఎంతగానో ఫిదా అయ్యారు. అయితే ఈ సినిమా సమయంలోనే అక్కినేని నాగార్జున టబూ మంచి స్నేహితులు అయ్యారు. చాలా క్లోజ్ గా ఉండేవారు. కానీ కొంతమంది వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుందని నెగిటివ్ గా రూమర్లు పుట్టించారు.


వీరిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలను వైరల్ చేశారు. రిలేషన్ కొనసాగిస్తున్నారని, వెకేషన్స్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు అన్ని తెలుసుకున్న నాగార్జున ఓ సందర్భంలో ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. హీరోయిన్ టబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి ఓపెన్ గా చెప్పేశారు. టబు, నేను ఇద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని నాగార్జున వెల్లడించారు.


ఆ స్నేహం కారణంగానే అమల ఒక రోజు టబును మా ఇంటికి ఇన్వైట్ చేసిందని చెప్పారు. అమల పిలవడం వల్లనే టబు మా ఇంటికి వచ్చిందని నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చిన తర్వాత ఈ వార్తలకు కాస్త చెక్ పడింది. కాగా, టబూ వయసు ప్రస్తుతం 50 ఏళ్లకు పైనే ఉంది. అయినప్పటికీ ఇంతవరకు వివాహం చేసుకోకుండా తన సింగిల్ లైఫ్ ని టబు హ్యాపీగా కొనసాగిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: