సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గురించి పరిచయం అనవసరం. జాక్వెలిన్ కు ఓ ఖైదీ ప్రేమలేఖ రాశాడు. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా జైలు జీవితం అనుభవిస్తున్న నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ఈ అందాల భామకు లవ్ లెటర్ రాశాడు. సుఖేశ్ చంద్రశేఖర్ రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో డిల్లీలో జైలు జీవితం గడుపుతున్నాడు. ఆ లెటర్ లో 'బేబీ వాలంటైన్స్ డే శుభాకాంక్షలు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రపంచం మొత్తంలో అద్బుతమైన ప్రియురాలివి నువ్వు. నేను నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాను.  జాకీ.. ఈ సంవత్సరం ప్రత్యేకమైన విషయాలతో ప్రారంభమైంది. ఈ ఏడాది మనకి అనుకూలంగా ఉంటుంది. మనం జీవితాంతం ప్రేమికుల రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. మరో జన్మ అంటూ ఉంటే ని హృదయంగా పుట్టాలని ఉంది. నువ్వు వివిధ దేశాలలో ప్రయాణించడానికి నీకు ప్రైవేట్ జెట్ కొనిస్తాను. నీ పేరులోని తొలి అక్షరాలను ఆ జెట్ పైన రాపిస్తాను. దాని రిజిస్ట్రేషన్ నెంబర్.. నీ పుట్టిన రోజు తేదీ అవుతుంది. నీలాంటి ప్రేయసి నాకు దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిని' అని సుఖేశ్ చంద్రశేఖర్ లేఖలో రాసుకొచ్చాడు. ఇప్పటికే జాక్వెలిన్ కు, సుఖేశ్ హోలీ పండుగ రోజున, ఈస్టర్ పండగ రోజున ఉత్తరాలు రాసిన విషయం తెలిసిందే. 
ఇక శ్రీలంకకు చెందిన సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తన అందం, నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. జాక్వెలిన్ సినిమాలలో రాకముందు మోడలింగ్ చేసేది. అలాగే ఈమె కొన్ని రోజులు టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది. 2011లో ఈమె నటించిన మర్డర్ 2 సినిమా వాళ్ల మంచి సక్సెస్ ని అందుకుంది. ఆ తర్వాత సినీ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వరుసగా విజయం సాదిస్తూ వచ్చింది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: