![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/why-pawan-kalyan-or-chiranjeevi-wont-make-any-comments-regarding-allu-arjun-arresta7b81129-2c1b-4425-8f0c-4e6a5fdb5935-415x250.jpg)
సుకుమార్ కి అసలేమాత్రం ప్లానింగ్ లేకుండా పుష్ప 3 అనౌన్స్ చేయడు. ఇదిలాఉంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తాడన్నది ఆసక్తికరమైన చర్చగా మారింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అసలైతే త్రివిక్రం తో సినిమా చేయాల్సి ఉంది. ఆల్రెడీ ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ చేశారు. ఐతే మధ్యలో అట్లీ వచ్చి కథ చెప్పగా బన్నీ కన్విన్స్ అయ్యాడని టాక్.
ఇదిలాఉంటే లేటెస్ట్ గా మలయాళ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ కూడా అల్లు అర్జున్ కి కథ చెప్పాడని ఆ కథకు కూడా బన్నీ ఇంప్రెస్ అయ్యాడని అంటున్నారు. అల్లు అర్జున్ తో బాసిల్ జోసెఫ్ ఒక థ్రిల్లర్ కథ అనుకున్నాడట. ఆ కథ అల్లు అర్జున్ కి నచ్చిందని తెలుస్తుంది. ఐతే మరోసారి సెకండ్ డిస్కషన్ చేశాక ఫైనల్ టాక్ ఏంటన్నది చెబుతారట. అల్లు అర్జున్ బసిల్ జోసెఫ్ తో సినిమా కుదిరితే మాత్రం డిఫరెంట్ కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ సినిమా వస్తుందని చెప్పొచ్చు. బసిల్ జోసెఫ్ డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా అదరగొట్టేస్తున్నాడు. ఈమధ్య అతను చేస్తున్న సినిమాలన్నె కూడా సూపర్ హిట్ లు అవుతున్నాయి.