రష్మిక గత కొద్ది సంవత్సరాలు నుండి కన్నడ ఇండస్ట్రీ నుండి బ్యాన్ అనే పదాన్ని ఎదుర్కొంటోంది.దానికి ప్రధాన కారణం కూడా రష్మిక చేసిన కొన్ని కామెంట్లే.రష్మిక ఆ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో కాంతార సినిమా రిలీజ్ అయిన సమయంలో మీరు కాంతార సినిమా చూశారా అంటే చూడలేదు అన్నట్లు మాట్లాడి కన్నడ ఇండస్ట్రీ నుండి వచ్చి కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన కాంతార సినిమా ఇండియాలోని అతిపెద్ద హిట్ అయింది. అయితే అలాంటి తమ కన్నడ మూవీ చూడలేదు అని చెప్పడంతో రష్మికపై కన్నడిగులు ఫైర్ అయ్యారు. అంతే కాదు రష్మికను కన్నడ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున పోస్టులు చేశారు.అయితే ఈ విషయంపై మరో ఇంటర్వ్యూలో స్పందించిన రష్మిక కాంతారా విడుదలైన రెండో రోజే నన్ను చూసారా అని అడిగారు.దానికి నేను చూడలేదని చెప్పాను. కానీ దానికే నాపై ఎంతో ట్రోల్ జరిగింది. అయితే ఈ సినిమా విడుదలయ్యాక వీలు చూసుకుని సినిమా చూసి ఆ తర్వాత బాగుందని సినిమా యూనిట్ కి మెసేజ్ పెట్టాను.వాళ్ళ నుండి థాంక్యూ అని రిప్లై కూడా వచ్చింది. 

మా మధ్య ఎలాంటి బంధం ఉందో తెలుసుకోకుండా నాపై ఇలా నెగిటివ్ వార్తలు స్ప్రెడ్ చేయడం బాలేదు. అలాగే నన్ను కన్నడ ఇండస్ట్రీ నుండి బ్యాన్ చేస్తున్నట్టు ఎలాంటి సమాచారం కూడా నాకు రాలేదు.అదంతా రూమర్స్ అంటూ కొట్టి పారేసింది.అయితే తాజాగా మరోసారి కన్నడ ఇండస్ట్రీ రష్మికపై కన్నేర్రజేసింది. మరి దానికి కారణం ఏంటంటే..తాజాగా బాలీవుడ్లో విక్కీ కౌశల్ తో రష్మిక నటించిన ఛావా మూవీ వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేను హైదరాబాదిని నేను ఒంటరిగా ఇక్కడికి వచ్చాను.కానీ ఇక్కడికి వచ్చాక మీరు అందరూ నా ఫ్యామిలీ అయ్యారు. థాంక్యూ అంటూ రష్మిక మాట్లాడిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో చాలా మంది కన్నడిగులు రష్మికపై ఫైర్ అవుతున్నారు. నువ్వు కర్ణాటకలోని కూర్గ్ అని చెప్పుకోకుండా హైదరాబాద్ అని అంటావా..

నువ్వు హైదరాబాద్ కు చెందిన అమ్మాయివా.. కూర్గ్ కి చెందిన అమ్మాయివా? హైదరాబాద్ అయితే కన్నడ ఇండస్ట్రీ నుండి నిన్ను బ్యాన్ చేయాల్సిందే అంటూ పెద్ద ఎత్తున మరోసారి పోస్టులు పెడుతున్నారు. ఇక మరికొంత మందేమో రష్మిక అలా మాట వరసకు చెప్పింది కావచ్చు కానీ చాలా ఇంటర్వ్యూలో ఆమె తనది కూర్గ్ గానే చెప్పింది అని గతంలో మాట్లాడిన వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు.ఇక ఇంకొంతమందేమో రష్మిక హైదరాబాది హీరోని పెళ్లి చేసుకోబోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా హైదరాబాద్ అని చెప్పింది కావచ్చు అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కన్నడ ఇండస్ట్రీ మరోసారి రష్మికపై ఫైర్ అవుతున్న పోస్టులు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: