ఏంటి అక్కినేని నాగార్జునతో మేనల్లుడు సుమంత్ కి గొడవలు అయ్యాయా.. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే సుమంత్ ఆ ఇంటర్వ్యూలో అలా మాట్లాడారా.. ఇంతకీ అక్కినేని ఫ్యామిలీ నచ్చదు అంటూ వేరే హీరోలను ఎందుకు మెచ్చుకున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చాలామంది హీరోలకు తమ ఫ్యామిలీ హీరోల కంటే ఇతర హీరోలే ఎక్కువగా ఇష్టం అంటారు.అయితే ఇష్టం వేరు రిలేషన్ వేరు కాబట్టి దన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అప్పుడప్పుడు కొంతమంది హీరోలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అంతేకాదు వారి మధ్య ఏదో గొడవ ఉంటేనే వాళ్ళు అలా ఇంట్లో వాళ్ళను కాదని బయటి వాళ్ళని ఇష్టపడుతుంటారని అంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం అక్కినేని నాగార్జున మేనల్లుడు సుమంత్ మాటలపై కూడా అలాంటి అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు.

 మరి ఇంతకీ సుమంత్ ఏం మాట్లాడరంటే సుమంత్ ఓ ఇంటర్వ్యూలో నేను అక్కినేని ఫ్యామిలీకి చెందిన హీరో అయినప్పటికీ నాకు అక్కినేని ఫ్యామిలీ హీరోల కంటే ఘట్టమనేని హీరోలు అంటేనే ఎక్కువగా ఇష్టం. మా తాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఎంతో పెద్ద హీరో..ఆయనని ఇష్టపడని వాళ్ళు ఉండరు. కానీ నాకు మా తాత ఏఎన్ఆర్ గారి కంటే సూపర్ స్టార్ కృష్ణ గారు అంటేనే ఎక్కువ ఇష్టం.అలాగే ఆ ఇష్టం కాస్త పెరుక్కుంటూ వచ్చింది. అందుకే నాకు మా అక్కినేని ఫ్యామిలీలో ఉన్న హీరోలు ఎవరు కూడా నచ్చరు.ప్రస్తుతం కృష్ణ గారి మీద ఉన్న ప్రేమ మహేష్ బాబు మీదికి మళ్ళింది. అలా ఇండస్ట్రీలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు నా ఫేవరెట్..

ఆయన సినిమాలు హిట్ అయిన ఫ్లాఫైన కచ్చితంగా చూస్తాను. అభిమానం కాస్త వీరాభిమానంగా మారిపోయింది. అందుకే నాకు మహేష్ బాబు అంటే చెప్పలేనంత ఇష్టం. అంటూ సుమంత్ మాట్లాడారు.అయితే సుమంత్ మాట్లాడిన ఈ మాటలు ఇప్పటివి కావు. గతంలో ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్. కానీ అప్పటి వీడియో ఇప్పుడు మళ్ళీ నెట్టింట వైరల్ గా మారడంతో సుమంత్ కి తాత,మేనమామ కంటే ఇతర హీరోలే ఎక్కువయ్యారా.. నాగార్జునతో సుమంత్ కి ఏమైనా గొడవలు ఉన్నాయా.. ఎందుకు సుమంత్ అక్కినేని ఫ్యామిలీ హీరోలను కాదని వేరే హీరోలను తన ఫేవరెట్ అంటున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈ వీడియో కింద కామెంట్లు వైరల్ అవుతున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి: