![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ram-charan-daughter-face-reveal-klin-kaara-chiranjeevi-upasana0b1a66cb-1bc4-4bb9-8318-039011c97942-415x250.jpg)
ఇటీవల రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షో కి కూడా హాజరైనప్పుడు తనని నాన్న అని పిలిచే వరకు తన కూతురు ఫేస్ రివిల్ చేయాలని తెలియజేశారు. అలా చెప్పి నెల రోజులు గడవకముందే తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివిల్ అయినట్టు ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. రామ్ చరణ్ తన కూతురుని ఎత్తుకొని నిలుచున్న సమయంలో కొంతమంది వీడియోలు, ఫోటోలు కూడా తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అవి క్షణాలలో కూడా వైరల్ గా మారుతున్నాయి.
వీటన్నిటిని చూసిన మెగా అభిమానులు ఆనందపడుతూ క్లింకార సూపర్ క్యూట్ అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికే వస్తే ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తన తదుపరి చిత్రం డైరెక్టర్ బుచ్చిబాబు సనా తో చేయబోతున్నారు. ఇందులో చాలామంది స్టార్స్ నటించేలా ప్లాన్ చేస్తున్నారు, RC -16 పేరుతో భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు ఈ ఏడాది దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రామ్ చరణ్ కూతురు వీడియో వైరల్ అవుతున్నది.