టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే వెంటనే ప్రభాస్ - అనుష్క పేర్లే అంతా చెబుతారు.. వీరిద్దరూ కలిసి నటించిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది... ప్రభాస్, అనుష్క కలసి నటించిన మొదటి సినిమా “బిల్లా”.. ఈ సినిమాలో ప్రభాస్ కట్ఔట్ కి అనుష్క పర్ఫెక్ట్ గా సరిపోయింది.. మెహర్ రమేష్ తెరకెక్కించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ తరువాత కొరటాల శివ తెరకెక్కించిన “మిర్చీ” సినిమాలో ప్రభాస్ సరసన అనుష్క హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో సైతం వీరిద్దరి పెయిర్ ఎంతో బాగుందని ప్రేక్షకులు కామెంట్స్ చేసారు..

రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీస్ బాహుబలి పార్ట్ 1,పార్ట్ 2 సినిమాలలో కూడా ఈ జంట కలిసి నటించారు.. దీనితో టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్ అయిన ప్రభాస్ అనుష్క ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది..అనుష్క తో ప్రభాస్ సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నాడని త్వరలోనే ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకోనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది.. ఎప్పటి నుంచో ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ న్యూస్ ఎంతో కిక్ ఇచ్చింది.. కానీ వారిద్దరి మధ్య ఏమి లేదంటూ గతంలో చాలా ఇంటర్వ్యూస్ లో అనుష్క, ప్రభాస్ క్లారిటీ ఇచ్చారు..

తాము ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని నా కెరీర్ లో బెస్ట్ కో స్టార్ ప్రభాస్ అని అనుష్క చెప్పారు.. తను చాలా సింపుల్ అని ఎవరితో అంతగా కలవడని బాహుబలి సినిమాతో మా ఫ్రెండ్షిప్ బలపడిందని ఆమె చెప్పుకొచ్చింది.. కానీ ఇన్నేళ్ళైనా అనుష్క పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ప్రభాస్ అని ఫ్యాన్స్ రూమర్స్ క్రియేట్ చేస్తూనే వున్నారు..త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో మరో బిగ్గెస్ట్ మూవీ తెరకెక్కనున్నట్లు కూడా ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: