నటి ఎస్తేర్ నోరోన్హ అంటే పరిచయం అక్కర్లేని పేరు. బోల్డ్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా వున్న ఎస్తేర్ ర్యాప్ సింగర్ నోయల్ శీను మాజీ భార్య అనే సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కనీసం పెళ్లయ్యాక నెలరోజులు కూడా కలిసి ఉండలేకపోయారు. దాంతో ఇద్దరు సంవత్సరానికే విడాకులు తీసుకున్నారు. ఇక విడాకుల తర్వాత ఎస్తేర్, నోయల్ ఇద్దరు ఎవరి వెర్షన్ లో వాళ్ళు తమ విడాకులపై ప్రేమపై మాట్లాడారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ స్టార్ డైరెక్టర్ పై సంచలన కామెంట్స్ చేసింది.మరి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరయ్యా అంటే తేజ.. జయం, ఔనన్నా కాదన్నా, చిత్రం, నిజం, నువ్వు నేను,లక్ష్మీ కళ్యాణం వంటి ఎన్నో హిట్ సినిమాలకు డైరెక్షన్ చేసిన డైరెక్టర్ తేజ అంటే ప్రత్యేక పరిచయాలు అక్కర్లేని పేరు.అయితే తేజ డైరెక్షన్ లో అంటే చాలామంది నటీనటులు భయపడి పోయే వారు.

ఎందుకంటే ఆయన ఏదైనా సీన్ కరెక్ట్ గా చేయగా పోయినా ఒక సీన్ కి ఎక్కువసార్లు టేకులు తీసుకున్నా కూడా షూటింగ్ సెట్లో అందరి ముందే కొట్టేవారట. అలా ఆయన చేతిలో ఇప్పటికే హీరోయిన్ కాజల్,రీమాసేన్, నితిన్ వంటి హీరో హీరోయిన్లు చెంప దెబ్బలు తిన్నట్టు వార్తలు వినిపించాయి. అయితే నటి ఎస్తేర్ ఈ విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఆ ఇంటర్వ్యూలో తేజ గురించి మాట్లాడుతూ..నేను నా మొదటి సినిమానే డైరెక్టర్ తేజ గారి దర్శకత్వంలో చేశాను. అయితే నేను షూటింగ్ జరుగుతున్న సమయంలో ఫ్రీ బర్డ్ లాగా తిరిగేదాన్ని. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వేంటి ఇలా తిరుగుతున్నావ్.. డైరెక్టర్ గారు చూస్తే కొట్టేస్తారు అని అన్నారు. అయితే నేను నిజమే కావచ్చు అని ఆయన దగ్గరికి వెళ్లి అడగగా నువ్వు సీన్ కరెక్ట్ గా చేశాక నిన్ను ఎందుకు కొడతాను.

నీకు ప్రామిస్ చేస్తున్నాను నీ వర్క్ నువ్వు కరెక్ట్ గా చేస్తే నిన్ను ఏమీ అనను అని అన్నారు. అయితే ఈ విషయం షూటింగ్ సెట్లో ఉన్నవాళ్లు చూసి అదేంటి తేజ గారు నీతో అంత కూల్ గా మాట్లాడారు.. కొట్టానని కూడా ప్రామిస్ చేశారు.నిన్ను ఆయన ఏమైనా ప్రేమిస్తున్నారా ఏంటి అంటూ మాట్లాడారా అని అడిగారు.వాళ్ళ మాటలకి నాకు సిగ్గేసింది. ఇక తేజ గారి డైరెక్షన్లో చేసిన సినిమా కూడా హిట్ అయింది అంటూ ఎస్తేర్ ఇంటర్వ్యూలో మాట్లాడింది. అయితే ఆ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్స్ ఆయన ఎంత పెద్ద డైరెక్టరో తెలుసా.. అసలు నీకు సిగ్గుందా.. ఆయన వయసు ఎక్కడ నీ వయసెక్కడ కొంచెం కూడా తెలివి లేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: