![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/trisha-rana-affier-rumaros-clearty-tollywood75f1d568-4533-45ef-8f8c-a0733daa182c-415x250.jpg)
అలాగే పలు రకాల వెబ్ సిరీస్లలో నటించిన త్రిష ప్రస్తుతం చిరంజీవికి జోడిగా విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నది. త్రిష సినిమాలలో ఎంత పాపులారిటీ సంబంధించిందో వ్యక్తిగత జీవితాల వల్ల కూడా అంతే పాపులారిటీ సంపాదించుకున్నది. ప్రస్తుత త్రిష వయసు 40 ఏళ్లు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. వివాహం కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా ఒక బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకోబోతుందనే విధంగా వార్తలు వినిపించాయి.
వీటితో పాటుగా త్రిష గతంలో టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన రాణా తో కూడా ప్రేమలో ఉందని పలు రకాల రూమర్స్ వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండే ఫోటోలు కూడా వైరల్ కావడమే కాకుండా పబ్బుల్లో పార్టీలలో కూడా కనిపిస్తూ తెలంగాణ చేసేవారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ రానా మాత్రం మీహిక బజాజ్ ను వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అయితే రానా, త్రిష మధ్య స్నేహబంధం ఉందంటూ త్రిష ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. తమ ఇద్దరి ఇల్లు కూడా పక్కపక్కన ఉండడం వల్లే తాము కలిసి పెరిగామని.. అలా త్రిష ఇంటికి రానా, రానా ఇంటికి త్రిష వెళ్లేవారట. ఇంట్లో వారందరితో కూడా ఎక్కువగా అన్యోన్యంగా ఉండడంతో పాటు సరదాగా ఉండేవాళ్ళం అంటూ తెలియజేసింది. మొత్తానికి ఎఫైర్ వార్తల పైన త్రిష క్లారిటీ ఇచ్చినట్లుగా గతంలో తెలుస్తోంది.