![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntrs-big-milestone-without-ssr-next-allu-arjun4883e10c-1b75-41eb-8403-1cfa121999df-415x250.jpg)
ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ సైతం తనకు సమీరారెడ్డి అంటే ఇష్టమని పరోక్షంగా చెప్పుకొచ్చారు. అయితే కులాలు, మతాలు వేరు కావడం వల్లే ఎన్టీఆర్, సమీరారెడ్డి పెళ్లి జరగలేదని చాలామంది భావిస్తారు. ఎన్టీఆర్ తర్వాత రోజుల్లో లక్ష్మీ ప్రణతిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి జోడీ క్యూట్ జోడీ అని ఫ్యాన్స్ భావిస్తారు.
లక్ష్మీ ప్రణతి సినిమా రంగానికి, సోషల్ మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. లక్ష్మీ ప్రణతి సినిమాలను బాగా ఎంజాయ్ చేస్తారని అయితే ఆ విషయాలను పబ్లిక్ గా ఎక్స్ ప్రెస్ చేయడానికి ఇష్టపడరని తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతి పూర్తి సమయాన్ని కుటుంబానికే కేటాయించారనే తెలుస్తోంది. లక్ష్మీ ప్రణతి ఇంట్రోవర్ట్ అని ఆమె సోదరుడు సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ లైఫ్ లోకి వచ్చాక తారక్ ఖాతాలో భారీ విజయాలు చేరాయని కూడా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. జూనియర్ ఎన్టీఆర్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తారక్ పారితోషికం సైతం గత కొన్నేళ్లలో అంచనాలకు మించి పెరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ ప్రణతికి అన్ని విషయాల్లో ఎన్టీఆర్ సపోర్ట్ ఉందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్స్ సైతం వేరే లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. తారక్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతోందనే సంగతి తెలిసిందే.