సినిమా ఇండస్ట్రీ లో గాసిప్స్ అనేవి చాలా సర్వసాధారణం. ఓ ఇద్దరూ నటీ నటులు కలిసి రెండు , మూడు సినిమాల్లో నటించారు అంటే చాలు వారిపై అనేక గాసప్స్ వస్తూ ఉంటాయి. ఇక వారు కలిసి బయట ఎక్కడ కనిపించారు అంటే చాలు ఆ గాసిప్స్ బలపడిపోవడం వారు ప్రేమలో ఉన్నారు అని , డేటింగ్ కూడా చేస్తున్నారు అని కూడా వార్తలు వస్తూ ఉంటాయి. ఇలా అనేక మంది నటీ నటుల విషయంలో జరిగిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.

ఇకపోతే తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సిద్ధార్థ్ , తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమంత గురించి కూడా అనేక గాసిప్స్ వైరల్ అయిన సందర్భాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి కేవలం జబర్దస్త్ అనే ఒకే ఒక సినిమాలో నటించారు. కానీ వీరి గురించి ఎన్నో గాసిప్స్ కొన్ని సంవత్సరాలు క్రితం వైరల్ అయ్యాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు అని , కలిసి కొన్ని ప్రదేశాలకి కూడా తిరిగారు అని , మరికొంత కాలం లోనే వీరు వివాహం కూడా చేసుకోబోతున్నారు అని వార్తలు వచ్చాయి.

కానీ వీరిద్దరు మాత్రం దానిపై పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత కొంత కాలానికే సమంత టాలీవుడ్ నటుడు అయినటువంటి నాగ చైతన్య ను వివాహం చేసుకుంది. ఇక సమంత కొంత కాలం క్రితమే నాగ చైతన్య నుండి కూడా విడిపోయి ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది. ఇక కొంత కాలం క్రితమే సిద్ధార్థ్ నటి అదితి రావు హైదరి ని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరిదీ ప్రేమ వివాహం. వీరు కొంత కాలం పాటు ప్రేమించి ఆ తర్వాత పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: