ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన గాసిప్ లలో ఎక్కువగా వినిపించేది శోభన్ బాబు జయలలితల ఎఫైర్ మ్యాటర్.. వీరు చనిపోయిన కూడా వీరి గురించి రూమర్లు ఇప్పటికి కూడా ఆగడం లేదు.ఎప్పుడో ఒకసారి శోభన్ బాబు జయలలిత గురించి ఏదో ఒక వార్త మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. శోభన్ బాబు జయలలిత ఇద్దరు సీక్రెట్ గా డేటింగ్ చేశారని,వీరికి ఒక పాప కూడా పుట్టిందని ఆ పాప ఈమెనే ఆమెనే అంటూ ఎన్నో ఫోటోలు రూమర్లు సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే.ఇక వాళ్లు డేటింగ్ చేసింది నిజమే కానీ వారికి పిల్లలు అయితే పుట్టలేదు అని ఇండస్ట్రీలో వారితో సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరు చెప్పిన మాట.అయితే ఎంతో సిన్సియర్ గా ప్రేమించిన జయలలిత శోభన్ బాబులు ఎందుకు పెళ్లి చేసుకోలేదు..శోభన్ బాబు జయలలితని పెళ్లి పీటల మీద ఎందుకు వదిలేశారు అనేది ఇప్పుడు చూద్దాం.. మాజీ తమిళనాడు సీఎం జయలలిత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది.ఆమె సంపాదించిన ఆస్తుల వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. 

అయితే అలాంటి మాజీ సీఎం జయలలిత ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన స్టార్ హీరోయిన్ అనే సంగతి కూడా మనకు తెలిసిందే.ఇక జయలలిత అప్పటి స్టార్ హీరో సోగ్గాడు శోభన్ బాబుని చాలా గాఢంగా ప్రేమించింది. ఇక శోభన్ బాబు కూడా జయలలిత మీద మనసు పడ్డాడు. కానీ వీరిద్దరూ పెళ్లయితే చేసుకోలేదు. శోభన్ బాబు జయలలితతో కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఇక మొదట్లో జయలలిత శోభన్ బాబు కంటే ముందే హీరోయిన్ అయిన సమయంలో శోభన్ బాబును చూసి జయలలిత తల్లి నా కూతురు పక్కనే హీరోగా శోభన్ బాబు వద్దే వద్దు అని మొహం మీదే రిజెక్ట్ చేసింది.కానీ అలాంటిది స్టార్డం వచ్చాక జయలలితనే స్వయంగా శోభన్ బాబుతో నటించడానికి ఒప్పుకుంది. అలా వీరిద్దరు చాలా సినిమాల్లో కలిసి నటించి చివరికి ప్రేమలో పడ్డారు. ఇక వీరి ప్రేమను సీక్రెట్ గా డేటింగ్ వరకు తీసుకువచ్చి చాలా రోజులు కలిసి ఉన్నారు.

అయితే ఈ విషయం శోభన్ బాబు ఫ్యామిలీకి తెలిసినా కూడా బయటకి రాలేదు.ఇక శోభన్ బాబు మీద పిచ్చి ప్రేమ పెంచుకున్న జయలలిత ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయింది. కానీ శోభన్ బాబు మాత్రం ఒప్పుకోలేదు. అయితే జయలలిత ఎన్నో తంటాలు పడి శోభన్ బాబుని పెళ్లికి ఒప్పించింది. అలా పెళ్లిరోజు పెళ్లికూతురు గెటప్ లో రెడీ అయ్యి శోభన్ బాబుకి ఫోన్ చేసింది.దాంతో ఆయన కూడా కారు వేసుకొని బయటికి వచ్చి కొద్ది దూరం రాగానే మళ్లీ తన భార్య, పిల్లలు గుర్తుకు రావడంతో వెనుదిరిగి వచ్చారట.ఆ తర్వాత మళ్లీ జయలలిత ఫోన్ చేయగా నిన్ను ప్రేమించడం నిజమే కానీ నా భార్యకు అన్యాయం చేయడం ఇష్టం లేదు.నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటూ జయలలితకు చెప్పారట.దాంతో జయలలిత పెళ్లి బట్టల మీదే శోభన్ బాబు చేసిన మోసానికి కన్నీళ్లు పెట్టుకుందట. ఆ తర్వాత కొద్ది రోజులు మాట్లాడక పోయినప్పటికీ మళ్లీ వీరి మధ్య ఉన్న ప్రేమ వీరిని కలిపింది. కానీ ఎన్నో రోజులు ప్రేమించుకున్న ఈ జంట పెళ్లి చేసుకోలేదు. ఇక శోభన్ బాబుని కాదని జయలలిత కూడా మరో వ్యక్తిని పెళ్లాడలేదు చివరి వరకు ఒంటరిగానే జీవించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: