టాలీవుడ్ యువ నటుడు అక్కినేని నాగ చైతన్య హీరోగా రూపొందిన తండల్ మూవీ ఫిబ్రవరి 7 వ తేదీన తెలుగు , తమిళ్ , హిందీ భాషలలో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ 7 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఫ్రీ రిలీజ్ చేసిన జరిగింది. ఇప్పటి వరకు ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 14.91 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.69 కోట్లు , ఉత్తరాంధ్రలో 4.87 కోట్లు , ఈస్ట్ లో 2.43 కోట్లు , వెస్ట్ లో 1.77 కోట్లు , గుంటూరు లో 1.95 కోట్లు , కృష్ణ లో 1.82 కోట్లు , నెల్లూరులో 1.11 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తం గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 7 రోజుల్లో 33.55 కోట్ల షేర్ ... 54.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని ఈ మూవీ కి 7 రోజుల్లో 3.70 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 4.25 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7 రోజుల్లో 41.50 కోట్ల షేర్ ... 72.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా దాదాపు 38 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ భారీలోకి దిగింది. 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 3.50 కోట్ల లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ చందు మండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించగా ... గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ , బన్నీ వాసు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: