తమిళ నటుడు అజిత్ కుమార్ తాజాగా విడముయార్చి అనే తమిళ సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని ఫిబ్రవరి 6 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమాను పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ కలెక్షన్లు వచ్చాయి. మరి ఎనిమిది రోజుల్లో ఈ మూవీ కి రోజు వారిగా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ... మొత్తంగా వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 32 లక్షల కలెక్షన్లు దక్కగా , రెండవ రోజు 24 లక్షలు , మూడవ రోజు 21 లక్షలు , నాలుగవ రోజు 15 లక్షలు , ఐదవ రోజు 4 లక్షలు , ఆరవ రోజు 3 లక్షలు , ఏడవ రోజు 2 లక్షలు , ఎనిమిదవ రోజు ఒక లక్ష కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఎనిమిది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.02 కోట్ల షేర్ ... 2.32 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇకపోతే ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.70 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ 3 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరి లోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 1.98 కోట్ల షేర్ కలక్షన్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి నట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ కి వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకోవడం కష్టంగానే కనబడుతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak