* ప్రభాస్, త్రిష సీక్రెట్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్

* పెళ్లి ప్రయత్నాలు విఫలం కావడంతో త్రిష ఒత్తిడి చేసిందా

* తల్లి మాట వినే ప్రభాస్ రిలేషన్‌షిప్ తెంచుకున్నాడట

(తెలంగాణ - ఇండియా హెరాల్డ్)

కాలం మారింది. సంబంధాల నిర్వచనాలు కూడా మారుతున్నాయి. ఒకప్పుడు పెళ్లి అంటే జీవితాంతం అనుకునేవారు. కానీ ఇప్పుడు అంతా ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. టాలీవుడ్‌లో అఫైర్స్‌ చాలా కామన్ అయ్యాయి. ఒకప్పుడు ఓ జంట గురించి బాగా గుసగుసలు వినిపించాయి. ఫిల్మ్ సర్కిల్స్‌లో పాన్ ఇండియా హీరో ప్రభాస్, సౌత్ ఇండియన్ క్వీన్ త్రిష... సీక్రెట్‌గా సహజీవనం చేస్తున్నారంటూ గుసగుసలు వినిపించాయి. ప్రభాస్ ఫ్రెండ్స్ మాత్రం దీన్ని కొట్టి పారేశారు. కానీ మరో వర్గం మాత్రం పెళ్లి ప్రయత్నాలు బెడిసి కొట్టడంతోనే త్రిష ఇలా సహజీవనం వైపు మొగ్గు చూపించినట్లు వాదించారు.

ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ప్రభాస్ తన తల్లి మాటకు ఎదురు చెప్పడట. అందుకే, త్రిష ఈ రూట్ ఎంచుకుందట. సహజీవనం చేస్తే, ప్రభాస్‌లో మార్పు వస్తుందని, కమిట్‌మెంట్ ఇస్తాడని త్రిష భావించిందట. వారిద్దరూ కలిసి ఉండటం ప్రభాస్ తల్లికి కూడా తెలిసిందట. ఆమె మందలించడంతో ప్రభాస్ త్రిషకి దూరమైనట్లు రూమర్స్ వచ్చాయి. అయితే, దీనిపై మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఈ అఫైర్ గురించి ఎప్పుడూ ఎవరూ కూడా అధికారికంగా బయట మాట్లాడలేదు. కనీసం ఈ రూమర్స్ కి స్పందించను కూడా లేదు.

ఇక త్రిష విషయానికొస్తే... ఆమె టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్. ‘క్వీన్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘96’ లాంటి ఎన్నో అవార్డ్ విన్నింగ్ సినిమాల్లో త్రిష తన నటనతో మెస్మరైజ్ చేసింది.ప్రభాస్, త్రిష కలిసి ‘వర్షం’ (2004), ‘పౌర్ణమి’ (2006), ‘బుజ్జిగాడు’ (2008) సినిమాల్లో నటించారు. ఈ సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసి, రియల్ లైఫ్‌లో కూడా వీరు ప్రేమలో ఉన్నారంటూ అప్పట్లో వార్తలు హల్‌చల్ చేశాయి. కానీ, ఎప్పుడూ వీరు తమ రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పలేదు.

ఇక రానా దగ్గుబాటి త్రిషతో కొన్నాళ్లు డేటింగ్ చేశాడనే విషయం అందరికీ తెలిసిందే. 2018లో ఓ ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ... త్రిష తనకు చాలా కాలం నుంచి ఫ్రెండ్ అని, కొన్నాళ్లు డేటింగ్ చేశామని, కానీ వర్కవుట్ కాలేదని చెప్పాడు. దీంతో త్రిష గత రిలేషన్‌షిప్స్‌పై కొంత క్లారిటీ వచ్చింది కానీ, ప్రభాస్‌తో రూమర్స్‌ మాత్రం అలానే ఉండిపోయాయి.

ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, త్రిష, ప్రభాస్‌తో కలిసి ‘స్పిరిట్’ సినిమాలో నటించే ఛాన్స్ ఉందట. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తే, మళ్లీ 16 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకున్నట్టవుతుంది. ప్రభాస్, త్రిష ఇద్దరూ తమ పర్సనల్ లైఫ్ విషయంలో చాలా ప్రైవేట్‌గా ఉంటారు. ఇప్పటివరకు ఈ రూమర్స్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ రూమర్స్‌లో నిజమెంత? కాలమే సమాధానం చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: