![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/n-balayya-special-gift-to-ss-thaman29b6cef0-55cb-4f04-b4de-6daf33bcbe16-415x250.jpg)
ఇదిలా ఉండగా.... నందమూరి బాలకృష్ణ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కు ఖరీదైనటువంటి పోర్షా కయెన్ కారును గిఫ్ట్ గా ఇచ్చి అతనికి సర్ప్రైజ్ ఇచ్చాడు. తమన్ తనకు తమ్మునితో సమానం అంటూ బాలకృష్ణ అన్నారు. వరుసగా నాకు నాలుగు హిట్లు ఇచ్చినందుకు ప్రేమతో ఈ కారును బహుమతిగా ఇచ్చానంటూ నందమూరి బాలకృష్ణ వెల్లడించాడు. కాగా, ఈ కారు ఖరీదు సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.... మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను త్వరలోనే ఓ కొత్త రోల్ లో చూడబోతున్నామనే వార్తలు చాలా రోజులుగా వైరల్ అవుతూనే ఉన్నాయి. తమన్ హీరోగా నటిస్తూ ఓ సినిమాను చేయబోతున్నారట. అది కూడా తమిళంలో అని తెలుస్తోంది. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ఆతర్వ తో కలిసి తమన్ మల్టీస్టారర్ సినిమాను చేయబోతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పనులు ప్రారంభమయ్యాయట. ఇక ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నట్లుగా వార్తలు వైరల్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎంపిక చేసే పనిలో దర్శకుడు ఉన్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమం కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమా పైన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.