అమలాపాల్..తమిళ,మలయాళ,తెలుగు సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే మొదట డైరెక్టర్ విజయ్ ని పెళ్లి చేసుకుంది.అయితే వీరిది ప్రేమ వివాహమే కానీ ఆ ప్రేమ వివాహం ఎన్నో సంవత్సరాలు  కొనసాగలేదు. ముఖ్యంగా పెళ్లయ్యాక  పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్న హీరోతో అమలాపాల్ ఎఫైర్ పెట్టుకుందని,ఆ ఎఫైర్ కారణంగానే భర్త అమలాపాల్ కి విడాకులు ఇచ్చారనే రూమర్ అప్పట్లో గట్టిగా వినిపించింది.ఇక అసలు విషయంలోకి వెళ్తే..అమలాపాల్ పెళ్లి చేసుకునే ముందే డైరెక్టర్ విజయ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ హీరోయిన్ కి కండిషన్స్ పెట్టారట.నువ్వు పెళ్లయ్యాక సినిమాలకు దూరంగా ఉండాలి.

ఒకవేళ సినిమాల్లో చేయాలి అనిపిస్తే బోల్డ్ పాత్రల్లో కాకుండా సాంప్రదాయమైన పాత్రల్లో మాత్రమే చేయాలి అని చెప్పారట.అయితే ప్రేమలో ఉన్న అమలాపాల్ కి తర్వాత ఏదైతే అది అన్నట్లుగా మొదట పెళ్లయితే చేసుకుందాం అని నిర్ణయించుకొని వాళ్ళ కండిషన్స్ కి ఓకే చెప్పింది.ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న వీరి సంసారం ఆ తర్వాత అనుకోకుండా గొడవలు స్టార్ట్ అయ్యాయి.

 ముఖ్యంగా పెళ్లయ్యాక తమిళ హీరో ధనుష్ తో అమలపాల్ ఎఫైర్ నడిపిందని,వీరి మధ్య ఉన్న ఎఫైర్ తెలిసే విజయ్ అమలాపాల్ తో ప్రతిరోజు గొడవలు పెట్టుకోవడం వల్ల విసిగిపోయిన అమలాపాల్ భర్తకి దూరమైందని,ఇక ఇద్దరి మధ్య ఉన్న ఎఫైర్ తెలిసి అమలాపాల్ కి భర్త విడాకులు ఇచ్చేసారని అప్పట్లో చాలా రూమర్లు వినిపించాయి.అయితే ఈ రూమర్లపై అమలాపాల్ స్పందించలేదు. కానీ వీరి విడాకుల సమయంలో అమలాపాల్ ధనుష్ కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో తెగచక్కర్లు కొట్టాయి. అలాగే విడాకులు అయ్యాక కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్న అమలాపాల్ ఆ తర్వాత జగత్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకి ఇద్దరు ట్విన్స్ కూడా పుట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: