టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో పోటీపడుతున్న దర్శకులలో నాగ్ అశ్విన్ కూడా ఒకరు. తను తెరకెక్కించిన కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండబోతుందనే విధంగా చివరిలో తెలియజేశారు.ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటికీ సినిమా షూటింగ్ మొదలు కాలేదు. కానీ కొంతమేరకు పూర్తి అయిందనే విషయాన్ని గతంలో తెలియజేశారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రభాస్ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఇప్పుడప్పుడే అయ్యేలా కనిపించడం లేదు.


దీంతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కల్కి సినిమా ఇప్పుడప్పుడే అయ్యేలా కనిపించడం లేదని డౌట్ రావడంతో బాలీవుడ్ హీరోయిన్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరోయిన్ ఎవరో కాదు ఆలియా భట్. ఈమెతో ఒక కథ కూడా చర్చించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కూడా ఒక ఫిమేల్ ఓరియంటెడ్ సినిమా గా ఉండబోతోందని మొదటి ఛాయస్ కింద ఈమెనే అడిగినట్లు డైరెక్టర్ నాగ్ అశ్విన్ వార్తలు వినిపిస్తున్నాయి.


ఆలియా కూడా కథ విని ఆమె సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. కల్కి సిల్క్వెల్ ప్రారంభం కావడానికి మరి కొంత సమయం పడుతుందని అందుకే ఆలియాతో సినిమా చేయడానికి సిద్ధమయ్యారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెలుస్తోంది.కానీ ఆలియా డేట్లు కూడా కొంతమేరకు ఇబ్బంది కలిగేలా ఉన్నాయట. ప్రస్తుతం ఈ అమ్మడు కూడా మూడు చిత్రాలలో నటిస్తూ ఉన్నది. కనుక ఈ సినిమాకు సంబంధించి ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రావాల్సి ఉన్నది.. ప్రభాస్ లైన్ అఫ్ విషయానికి వస్తే రాజా సాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2 వంటి చిత్రాలను ఇంకా చేయవలసి ఉన్నదట. ఆ తర్వాతే కల్కి 2 చేసేలా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉన్నది

మరింత సమాచారం తెలుసుకోండి: